ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: కందుకూరు నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా వ‌లేటివారి పాలెం, కందుకూరు మండ‌లాలు కందుకూరు నియె జ‌క‌వ‌ర్గంలో చేరాయి. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి మూడు సార్లు గెలిచారు. వ‌రుస‌గా రెండు సార్లు ఎమ్మెల్యే అయిన దివి శివ‌రాం ను 2004,2009 ఎన్నిక‌ల్లో మ‌హీధ‌ర్ రెడ్డి ఓడించారు. 2009 ఎన్నిక‌ల్లోనూ టిడిపి నుండి పోటీ చేసిన దివి శివ‌రాం ఓడిపోయారు. ఆయన తండ్రి కొంద‌య్య చౌద‌రి సైతం రెండు సార్లు గెలిచారు. రాష్ట్ర మంత్రిగా, స్పీక ర్ గా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. మ‌రో ప్ర‌ముఖుడు న‌ల‌మోతు చెందురామ‌నాయుడు ఇక్క‌డ మూడు సార్లు, కొండెపి లో ఒక‌సారి మొత్తం నాలుగుసార్లు ఎన్నిక‌య్యారు. ఆయ‌న కాసు, పివి ల మంత్రివ‌ర్గంలో ప‌ని చేసారు. ప్ర‌కాశం జిల్లాలో ఉన్న కందుకూరు ..నెల్లూరు లోక్‌స‌భ ప‌రిధిలోకి వ‌స్తుంది.

14 సార్లు ఎన్నిక‌లు..
కందుకూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి మొత్తంగా 14 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో తొమ్మ‌ది సార్లు కాంగ్రెస్ గెల‌వ గా.. టిడిపి రెండు సార్లు గెలిచింది. స్వ‌తంత్రులు రెండు సార్లు గెలుపొందారు. వైసిపి ఒక‌సారి గెలిచింది. ఇక‌, ఇక్క‌డ నుండి మూడు సార్లు గెలిచిన మ‌హీధ‌ర్ రెడ్డి కిర‌ణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా ప‌ని చేసారు. అప్ప‌టి వ‌ర‌కు జిల్లా నుండి మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాస రెడ్డి రాజీనామా తో ఆయ‌న స్థానంలో మ‌హీధ‌ర్ రెడ్డికి అవ‌కాశం క‌ల్పించారు. ఆయ‌న మ‌న్సిప‌ల్ శాఖా మంత్రిగా ప‌ని చేసారు.

 #AndhraPradeshElections2019: All about Kandukur Constituency

2014 ఎన్నిక‌ల్లో వైసిపి గెలుపు..
2014 లో కందుకూరు లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తంగా 194679 ఓట్లు ఉండ‌గా, అందులో 172712 ఓట్లు పోల‌య్యాయి. వైసిపి నుండి పోటీ చేసిన పోతుల రామారావుకు 84538 ఓట్లు రాగా, టిడిపి నుండి పోటీ చేసిన దివి శివ‌రాం కు 80732 ఓట్లు వ‌చ్చా యి. వైసిపి అభ్య‌ర్ధి పో తుల రామారావు 3806 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆ త‌రువాత జిల్లా లో వైసిపి నుండి గెలిచిన ప‌లువురు ఎమ్మెల్యేలు టిడిపిలోకి చేరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+