ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ముమ్మిడివరం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అప్పటి వరకు రిజర్వ్ గా ఈ నియోజకవర్గం జనరల్ గా మారిం ది.1996 లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇక్కడ నుండి టిడిపి అభ్యర్దిగా గెలిచిన బాలయోగి అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా , ఆ తరువాత లోక్‌సభ స్పీకర్ గా వ్యవహరించారు. 1999 లో కేంద్రంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం ఒక ఓటుతో పడి పోయినప్పుడు బాలయోగి నిష్పక్షపాతంగా వ్యవహరించారనే కీర్తి సంపాదించారు. 2002 మార్చి లో జరిగిన హెలికాఫ్టర్ ప్ర మాదంలో ఆయన మృతి చెందారు. ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన భార్య విజయకుమారి గెలుపొందారు.కాం గ్రెస్ నుండి రెండు సార్లు గెలిచిన బత్తిన సుబ్బారావు సైతం పివి, జలగం క్యాబినెట్‌లో పని చేసారు. చెల్లి వివేకానంద ఇక్క డ రెండు సార్లు గెలుపొందారు.
11 సార్లు ఎన్నికలు జరిగితే..
1955 నుండి 1972 వరకు చెయ్యేరు నియోజకవర్గంగా ఉండగా, 1978 నుండి ముమ్మిడివరంగా మారింది. ఇక్కడ 11 సార్లు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ అయిదు సార్లు, టిడిపి ఆరు సార్లు గెలిచింది. దళిత నేత బత్తిన సుబ్బారావు రెండు సార్లు కడి యం, బూరుగుపూడి ల్లో గెలిచారు. 2004 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి విశ్వరూప్ గెలవగా, 2009 ఎన్నికల్లో సతీష్ కుమార్ గెలుపొందారు. విశ్వరూప్ 2009 లో అమలాపురం నుండి పోటీ చేసారు. 2014 ఎన్నికల ముందు ఇక్కడ సమీకరణా ల్లో మార్పులు జరిగాయి.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ మొత్తంగా 208297 ఓట్లు ఉండగా, 172632 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసి న బుచ్చిరాజు కు 98274 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన శ్రీనివాసరావుకు 68376 ఓట్లు వచ్చాయి. టిడిపి నుండి బరిలో నిలిచిన బుచ్చి రాజుకు 29538 ఓట్ల మెజార్టీ వచ్చింది.
-
కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు, దక్కేది వీరికే - తాజా నిర్ణయం..!! -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
హనుమ జయంతి వేళ చిరంజీవి ఇంట్లో అరుదైన అపురూప దృశ్యం..!! -
మందు బాబుల పండుగ, ఫుల్లు కిక్కు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
అర్థరాత్రి మీటింగ్.. తెల్లవారేసరికి సీన్ రివర్స్! రష్యాతో భారత్ కొత్త వ్యూహం -
అమరావతి బిల్లు పై బీఆర్ఎస్ అనూహ్య ట్విస్ట్..!! -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం- లేటెస్ట్ లెక్కలు -
1997 నాటి సంక్షోభం నీడలో రూపాయి. చరిత్ర పునరావృతం అవుతుందా? -
నియోజకవర్గాల పెంపు వేళ బిగ్ ట్విస్ట్, ఎవరికి అనుకూలం..!! -
ఫ్లాప్ రికార్డులన్నీ బ్రేక్ చేసిన హీరో అతనే.. రూ.45 కోట్లతో బడ్జెట్ - రూ. 60 వేలు కలెక్షన్స్ !












Click it and Unblock the Notifications