ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పెద్దాపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా గతంలో ఉన్న పెద్దాపురం, సామర్లకోట మండలాలు పూర్తిగా విలీనమయ్యా యి. 2009 లో ప్రజారాజ్యం జిల్లాలో గెలిచిన మరో నియోజకవర్గం పెద్దాపురం. జిల్లా రాజకీయాల్లో పేరున్న తోట కుటుంబం నుండి తోట రామస్వామి 1952 లో గెలిచారు. కాంగ్రెస్ ప్రముఖుడు పంతం పద్మనాభం ఇక్కడ రెండు సార్లు, జగ్గంపేట లో రెండు సార్లు గెలిచారు. 2004 లో కాంగ్రెస్ తరపున గెలిచిన తోట గోపాలకృష్ణ గతంలో కాకినాడ ఎంపిగా రెండు సార్లు పని చేసారు. ఆయన సోదరుడు తోట సుబ్బారావు సైతం ఎమ్మెల్యేగా, ఎంపిగా ఎన్నికయ్యారు. పంతం పద్మనాభం 1991 లో నేదురుమల్లి క్యాబినెట్ లో ఉన్నారు. తోట సుబ్బారావు ఎన్టీఆర్ క్యాబినెట్‌లో పని చేసారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుండి ప్రజారాజ్యం అభ్యర్ది గా పంతం గాంధీ మోహన్ గెలుపొందారు.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
పెద్దాపురం నియోజకవర్గానికి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఆరు సార్లు కాంగ్రెస్ గెలిచింది. టిడిపి అయిదు సార్లు గెలవగా, సిపిఐ రెండు సార్లు, ప్రజారాజ్యం ఒకసారి గెలిచాయి. ఇక్కడ టిడిపి నుండి రెండు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన బొడ్డు భాస్కర రామారావు వైసిపి లో చేరారు. ఆయన కుమారుడు రాజమండ్రి లో వైసిపి నుండి పోటీ చేసారు. అమలాపురానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ గా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప ను ఇక్కడి నుండి 2014 లో బరిలోకి దింపారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 194939 ఓట్లు ఉండగా, అందులో 149549 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన నిమ్మకాయల చినరాజప్ప కు 75914 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన తోట సుబ్బారావుకు 65251 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది చినరాజప్ప 9663 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆయన గెలిచిన తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి హోదాలో హోం శాఖ ను పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications