ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: పిఠాపురం నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాలు పూర్తిగా ఈ సెగ్మెంట్ లో వి లీనం అయ్యాయి. సీనియర్ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం 2009 లో కాంగ్రెస్ పక్షాన పోటీ చేసి ఓడిపోయారు. 2004 లో టిడిపి మిత్రపక్షంగా ఉన్న బిజెపి తరపున పోటీ చేసిన దొరబాబు టరమ్ చివరలో శాసనసభకు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఇక్కడి నుండి గెలిచిన కె మోహనరావు కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. 2009 లో ఇక్కడ నుండి ప్రజారాజ్యం అభ్యర్దిగా పోటీ చేసిన రాజ్యసభ మాజీ సభ్యురాలు వంగా గీత టిడిపి అభ్యర్ది వర్మ పై 1036 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 లో ఆయనకు టిడిపి టిక్కెట్ దక్కలేదు.
15 సార్లు ఎన్నికలు..
ఇక్కడ మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ ఆరు సార్లు, టిడిపి మూడు సార్లు, ప్రజాపార్టీ రెండు సార్లు , సిపిఐ, బిజెపి,ప్రజారాజ్యం ఒక్కో సారి గెలిచాయి. ఒక సారి స్వతంత్ర అభ్యర్ది గెలుపొందారు. 2009 తరువాత మారిన రాజ కీయ సమీకరణాల్లో భాగంగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు వైసిపి లో చేరారు. 2014 లో టిడిపి నుండి వర్మకు సీటు ఇ వ్వక పోవటంతో ఆయన స్వతంత్ర అభ్యర్దిగా బరిలోకి దిగారు.

2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ది గెలుపు..
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తంగా 213512 ఓట్లు ఉండగా, అందులో 168616 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్దిగా పోటీ చేసిన వర్మ కు 97511 ఓట్లు రాగా , వైసిపి నుండి పోటీ చేసిన పెండెం దొరబాబుకు 50431 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్య ర్ది వర్మ 47080 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు. ఎన్నికల్లో గెలిచిన వర్మ తిరిగి టిడిపిలో చేరారు.












Click it and Unblock the Notifications