ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తాడేప‌ల్లి గూడెం నియోజ‌క‌వ‌ర్గం గురించి తెలుసుకోండి

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా తాడేప‌ల్లి గూడెం, పెంట‌పాడు మండ‌లాలు పూర్తిగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో చేరాయి. జిల్లాలో ఆరు సార్లు గెలిచిన నేత‌గా గుర్తింపు ఉన్న మూర్తిరాజు తాడేప‌ల్లి గూడెంలో రెండు సార్లు గెలిచారు. పెంట పాడు, ఉంగుటూరు లో మ‌రో నాలుగు సార్లు గెలుపొందారు. ఈ ప్రాంత ప్ర‌ముఖుడు ఈలి ఆంజనేయులు రెండు సార్లు గెలి స్తే, ఆయ‌న మ‌ర‌ణం త‌రువాత భార్య వ‌ర‌త‌ల‌క్ష్మీ ఉప ఎన్నిక‌లోనూ విజయం సాధించారు.2009 లో గెలిచిన మ‌ధుసూద‌న రావుకు ఈలి ఆంజ‌నేయులు తండ్రి అవుతారు. మూర్తిరాజు పివి హాయంలో మంత్రిగా ప‌ని చేసారు. ఈలి ఆంజ‌నేయులు గ‌తంలో ఎన్టీఆర్ క్యాబినెట్‌లో మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, 2014 ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితుల్లో పూర్తి గా మార్పు క‌నిపించింది. అనేక స‌మీక‌ర‌ణాలు మారాయి.

16 సార్లు ఎన్నిక‌లు జ‌రిగితే..
ఇక్క‌డ మొత్తంగా 16 సార్లు ఎన్నిక‌లు జ‌రిగాయి. అందులో కాంగ్రెస్ ఏడు సార్లు, టిడిపి ఆరుసార్లు, ప్ర‌జారాజ్యం ఒక‌సారి, స్వతంత్ర అభ్యర్ది ఒక‌సారి , బిజెపి ఒక‌సారి గెలిచాయి. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో టిడిపి - బిజెపి పొత్తులో భాగంగా బిజెపి కి ఈ సీటు కేటాయించారు. టిడిపిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొట్టు స‌త్య‌నారాయ‌ణ టిక్కెట్ రాక‌పోవ‌టం తో స్వ‌తంత్ర అభ్య‌ర్దిగా 2014 ఎన్నిక‌ల బ‌రి లోకి దిగారు. మ‌రో మాజీ ఎమ్మెల్యే ఈలి నాని సైతం టిడిపిలో చేరినా పోటీ కి దూరంగా ఉన్నారు.

AndhraPradeshElections2019: All about Tadepalligudem Constituency

2014 ఎన్నిక‌ల్లో బిజెపి గెలుపు
2014 ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మొత్తం 193025 ఓట్లు ఉండ‌గా, అందులో 155978 ఓట్లు పోల‌య్యాయి. బిజెపి నుండి పోటీ చేసిన మాణిక్యాల రావు కు 73339 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన గోపాల స‌త్య‌నారాయ‌ణ‌కు 59266 ఓట్లు వ‌చ్చాయి. బిజెపి అభ్య‌ర్ది మాణిక్యాల రావు 14073 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గెలిచిన త‌రువాత మాణిక్యాల రావు చంద్ర‌బాబు క్యాబినెట్ లో మంత్రిగా ప‌ని చేసారు. కేంద్రంలో బిజెపి తో వ‌చ్చిన విభేదాల కార‌ణంగా ఆయ‌న మంత్రి ప‌ద‌వి వీడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+