ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: తణుకు నియోజకవర్గం గురించి తెలుసుకోండి
2009 నియోజకవర్గాల పునర్విభజన లో భాగంగా అత్తిలి మండలం కొత్తగా వచ్చి చేరింది. తణుకు అంటే ముందుగా గుర్తు కు వచ్చే ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. జి సత్యానారాయణ మూర్తి రెండు సార్లు గెలుపొందారు. ఆయన అల్లుడు ముళ్లపూడి వెంకట కృష్ణారావు మూడు సార్లు గెలిచారు. హరిశ్చంద్రప్రసాద్ అల్లుడు వైటి రాజా ఒకసారి గెలిచారు. మరో పారిశ్రామిక వేత్త చిల్లూరి ఇంద్రయ్య ఒకసారి గెలిస్తే..ఆయన కుమారులు చిట్టూరు వెంకటేశ్వరరావు, బాపినీడు ఒక్కొక్క సారి గెలుపొందారు. ముళ్లపూడి సమీప బంధువు బోళ్ల బుల్లిరామయ్య ఏలూరు నుం డి నాలుగు సార్లు లోక్‌సభ కు ఎన్నికయ్యారు. ఆయన కేంద్రంలో మంత్రిగా పని చేసారు. 2009 ఎన్నికల్లో ఇక్కడ నుండి కారుమూరు నాగేశ్వరరావు వైటి రాజా పై గెలుపొందారు.
14 సార్లు ఎన్నికలు జరిగితే..
తణుకు లో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే అక్కడ ఆరు సార్లు కాంగ్రెస్ గెలిచింది. టిడిపి ఆరు సార్లు గెలుపొం దింది. కెఎంపిపి ఒక్కసారి, స్వతంత్ర అభ్యర్ది ఒకసారి గెలిచారు. జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేసిన కారుమూరి నాగేశ్వర రావు 2009 లో కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి 1451 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2009 ఎన్నికల తరువాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆయన కాంగ్రెస్ ను వీడి..2014 ఎన్నికల సమయంలో వైసిపి లో చేరారు.

2014 ఎన్నికల్లో టిడిపి గెలుపు
2014 ఎన్నికల్లో ఇక్కడ మొత్తం 219133 ఓటర్లు ఉండగా, అందులో 178197 ఓట్లు పోలయ్యాయి. టిడిపి నుండి పోటీ చేసిన ఏ రాధాకృష్ణ కు 101016 ఓట్లు రాగా, వైసిపి నుండి పోటీ చేసిన రాధాకృష్ణకు 70067 ఓట్లు వచ్చాయి. టిడిపి అభ్యర్ది ఏ రాధాకృష్ణ 30948 ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు.












Click it and Unblock the Notifications