జెయింట్ కిల్లర్: పట్టుబట్టి కవిత (పిక్చర్స్)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వ్యూహానికి తెలంగాణ కాంగ్రెసు దిమ్మ తిరిగింది. దేశవ్యాప్తంగా వీచిన బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గాలికి ఎదురీది కెసిఆర్ లోకసభ ఫలితాల్లోనూ సత్తా చాటారు. మోడీకి అనుకూల వాతావరణం ఏర్పడుతుందని భావించిన తరుణంలో ఆయన కేంద్రంలో ఎక్కువ మంది ఎంపీలు ఉంటేనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలమని కెసిఆర్ ప్రజలకు చెప్పడంలో విజయం సాధించారు.

బిజెపితో పొత్తు పెట్టుకుంటారనే అపోహలను తొలగిస్తూనే తెలంగాణ నుంచి ఎక్కువ మంది ఎంపీలను పంపాల్సిన అవసరాన్ని కెసిఆర్ ప్రజలకు స్పష్టమయ్యేలా చెప్పారు. దాంతో తెలంగాణలోని 17 లోకసభ స్థానాల్లో 11 స్థానాలను గెలుచుకుని భలే అనిపించారు.

విద్యార్థి నేత బాల్క సుమన్‌ను ఓడించడం తరం కాదనుకున్న కాంగ్రెసు అభ్యర్థి జి. వివేక్‌పై పోటీకి దించారు. బాల్క సుమన్ జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. నిజామాబాద్ లోకసభ స్థానంపై కెసిఆర్ తనయ కల్వకుంట్ల కవిత చాలా క్రితమే కన్నేశారు. దానికి అనుగుణంగానే ఆమె నిజామాబాద్ లోకసభ స్థానంలో పునాదిని గట్టి చేసుకుంటూ వెళ్లారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీని దెబ్బ తీయడం కష్టమని భావించిన తరుణంలో ఆమె తన సత్తా చాటారు.

గడ్డం నగేష్

గడ్డం నగేష్

ఆదిలాబాద్ లోకసభ స్థానంలో తెరాస అభ్యర్థిగా పోటీ గడ్డం నగేష్ విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చి ఆయన తెరాసలో చేరి జాక్‌పాట్ కొట్టారు.

బాల్క సుమన్

బాల్క సుమన్

విద్యార్థి నేత బాల్క సుమన్ జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. జి. వివేక్‌పై గెలవడం ఆయన వల్ల కాదని అనుకున్నారు. కానీ విజేతగా అవతరించారు.

వినోద్ కుమార్

వినోద్ కుమార్

కరీంనగర్ లోకసభ స్థానంలో తెరాస బలంగా ఉంది. కానీ, గత ఎన్నికల్లో కాంగ్రెసు నేత పొన్నం ప్రభాకర్ విజయం సాధించారు. కెసిఆర్‌కు అత్యంత సన్నిహితుడైన వినోద్ కుమార్ మరోసారి పోటీ చేసి విజయం సాధించారు.

కల్వకుంట్ల కవిత

కల్వకుంట్ల కవిత

రాజకీయాల్లోకి వద్దని తండ్రి కెసిఆర్, సోదరుడు కెటిఆర్ చెప్పినా వినలేదు. అయితే, తానేమిటో నిరూపించుకోవాలని కెసిఆర్ సూచించారు. దాంతో తెలంగాణ జాగృతిని ఏర్పాటు చేసి బతుకమ్మను ఊరూరా ప్రదర్సించి, నిజామాబాద్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

బిబి పాటిల్...

బిబి పాటిల్...

కాంగ్రెసు పట్టు ఉన్న జహీరాబాద్ లోకసభ స్థానంలో కూడా తెరాస పాగా వేసింది. బిబి పాటిల్ విజయం సాధించారు.

కె. చంద్రశేఖర రావు

కె. చంద్రశేఖర రావు

తెరాస అధినేత కె. చంద్రశేఖర రావు మెదక్ లోకసభ స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. శాసనసభకు గజ్వెల్ నుంచి ఎంపికయ్యారు. తెలంగాణ తొలి సిఎం కానున్న నేపథ్యంలో ఆయన మెదక్ లోకసభకు రాజీనామా చేసే అవకాశాలున్నాయి.

బలహీనమని అన్నారు..

బలహీనమని అన్నారు..

మల్లారెడ్డిని మల్కాజిగిరి సీటుకు ఎంపిక చేసినప్పుడు జెపిని గెలిపించడానికి బలహీమైన అభ్యర్థిని దించారనే విమర్శలు వచ్చాయి. ఆ విమర్సలను తిప్పికొడుతూ మల్లారెడ్డి విజయం సాధించారు.

పట్టుబట్టి మరీ...

పట్టుబట్టి మరీ...

సికింద్రాబాద్ లోకసభ సీటు టికెట్ కావాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి కోరుకున్నారు. కానీ పట్టుబట్టి ఆ స్థానం నుంచి పోటీ చేసి బండారు దత్తాత్రేయ విజయం సాధించారు.

అసదుద్దీన్ ఓవైసీ..

అసదుద్దీన్ ఓవైసీ..

హైదరాబాద్ లోకసభ స్థానం నుంచి మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ హ్యాట్రిక్ సాధించారు. బిజెపి ప్రయత్నం ఫలించలేదు.

కొండా విశ్వేశ్వర రెడ్డి

కొండా విశ్వేశ్వర రెడ్డి

చేవెళ్ల లోకసభ స్థానంలో తెలంగాణ ఉద్యమ నేత కొండా వెంకటరంగారెడ్డి వారసుడు కొండా విశ్వేశ్వర రెడ్డి పాగా వేశారు.

ఎట్టకేలకు జితేందర్ రెడ్డి

ఎట్టకేలకు జితేందర్ రెడ్డి

మహబూబ్‌నగర్ స్థానం నుంచి లోకసభకు వెళ్లాలన్న జితేందర్ రెడ్డి కోరిక ఎట్టకేలకు నెరవేరింది. బిజెపి అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డిని, కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని ఢీకొట్టి ఆయన తెరాస నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

నంది ఎల్లయ్య

నంది ఎల్లయ్య

నాగర్‌కర్నూలు నుంచి తెరాస అభ్యర్థి మందా జగన్నాథం విజయం ఖాయమనే నమ్మకాన్ని కాంగ్రెసు అభ్యర్థి నంది ఎల్లయ్య వమ్ము చేశారు. ఆయనకున్న మంచిపేరే విజయం సాధించి పెట్టిందని అంటున్నారు.

గుత్తా సుఖేందర్ రెడ్డి

గుత్తా సుఖేందర్ రెడ్డి

కాంగ్రెసుకు ఎదురుగాలి వీచిన స్థితిలో తట్టుకుని నల్లగొండ లోకసభ స్థానం నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి విజయం సాధించారు. కింది స్థాయి కార్యకర్తలతో ఆయనకున్న సంబంధాలే నిలబెట్టాయి.

బూర నర్సయ్య గౌడ్

బూర నర్సయ్య గౌడ్

భువనగిరి లోకసభ స్థానంలో సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోవడం సాహసమే అని భావించారు. కానీ, తెరాస నుంచి పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ ఎదుర్కోవడమే కాకుండా నిలిచి గెలిచారు.

సీతారాం నాయక్

సీతారాం నాయక్

కేంద్ర మంత్రి బలరాం నాయక్‌ను మహబూబాబాద్ లోకసభ స్థానంలో ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి. పైగా సీమాంధ్ర ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ స్థితిలో తెరాస అభ్యర్థి సీతారాం నాయక్ విజయం సాధించారు.

కడియం శ్రీహరి

కడియం శ్రీహరి

ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు కడియం శ్రీహరి. తెలంగాణపై చంద్రబాబు వైఖరి నచ్చక ఆయన తెరాసలో చేరి, వరంగల్ లోకసభ స్థానం నుంచి విజయం సాధించారు.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి

పొంగులేటి శ్రీనివాస రెడ్డి

తెలంగాణ పర్యటనలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఖమ్మం లోకసభ స్థానానికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేరును ప్రకటించారు. సిపిఎం మద్దతుతో ఆయన గట్టెక్కారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+