మోడీ చేతిలో కొత్త అస్త్రం : సర్జికల్ స్ట్రైక్ మోడీ పొలిటికల్ మైలేజ్ ను పెంచిందా!

న్యూఢిల్లీ : సర్జికల్ స్ట్రైక్స్ ప్లానింగ్స్.. దాడి జరిగిన తీరు.. ఇవన్నీ ఎలా ఉన్నా.. బీజేపీకి మాత్రం ఈ అంశం పొలిటికల్ మైలేజ్ ను పెంచేదిగానే మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవిధంగా.. సర్జికల్ స్ట్రైక్ చేయడానికి ప్రధాని మోడీ తెగువ చూపించి ఉండకపోతే.. రక్షణ అనే అంశాన్ని ఆయుధంగా చేసుకుని ప్రతిపక్షాలు ఆయన్ను ఇరుకున పెట్టే అవకాశముండేది.

ముఖ్యంగా.. ఉత్తరప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ అంశం మోడీకి ప్రతికూలంగా మారి ఉండేది. కాబట్టే ఒకింత ముందుచూపుతో వ్యవహరించిన మోడీ సర్జికల్ స్ట్రైక్ దాడులకు ఏమాత్రం వెనుకాడలేదని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలను ఎదుర్కొని బీజేపీని అధికారంలోకి తీసుకురావడం అంత సులువుగా సాధ్యమయ్యే పని కాదు. అయితే ఎన్నికలకు కొద్దిరోజులు ముందుగా జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్ దాడి అక్కడి ప్రజల్లో మోడీ ఇమేజ్ ను మరింత పెంచుతుందనే భావనలో బీజేపీ నేతలు ఉన్నారు.

సర్జికల్ స్ట్రైక్ గనుక జరగకపోయుంటే.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారానికి మోడీ అమ్ముల పొదిలో అభివృద్ది మరియు పాలనా అనే రెండు అస్త్రాలు మాత్రమే ఉండేవి. తాజా ఘటనతో మోడీ అస్త్రాల్లో 'రక్షణ' అనే అంశం కూడా చేరింది. దీనికి తగ్గట్టు సర్జికల్ స్ట్రైక్ క్రెడిట్ ను బీజేపీ పూర్తి స్థాయిలో వినియోగించాలనే యోచనలో ఉంది. అందుకే పార్టీ నేతలు సైతం మోడీని ప్రశంసలతో ముంచెత్తుతూ.. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ఇమేజ్ మాత్రమే కనపడేలా ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.

 Modi gets back his mojo, surgical strikes will benefit BJP in state elections

ఇదే క్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేసిన కామెంట్స్ ను పరిశీలిస్తే.. 'ఉగ్రవాదాన్ని ఈవిధంగా ఎదుర్కొన్న తీరు మునుపెన్నడూ లేదు.. మోడీ నాయకత్వంలో భారత్ సురక్షితంగా ఉంటుంది' అంటూ ఆయన నాయకత్వానికి మరింత బూస్టింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కమల దళం వికాసం కోసమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

పఠాన్ కోట్ పై దాడి ప్రధాని మోడీ 'ఐరన్ మ్యాన్' ఇమేజ్ ను సందిగ్ధంలో నిలబెట్టగా.. తాజా సర్జికల్ స్ట్రైక్ వ్యూహం మాత్రం మోడీ ఇమేజ్ ను అమాంతం పెంచేసిదిగా మారిందన్న చర్చ కూడా జరుగుతోంది. యూరీ ఘటనలో 18మంది సైనికులు చనిపోయాక కూడా.. పాక్ పై చర్యలకు మోడీ వెనకాడుతున్నారన్న విషయాన్ని ప్రతిపక్షాలు సోషల్ మీడియా ద్వారా ఎండగట్టే ప్రయత్నం చేశాయి. అయితే తాజా సర్జికల్ దాడితో వాటన్నింటికి చెక్ పెట్టినట్టయింది.

పటిష్టమైన భారత ఆర్మీ ప్రజాస్వామ్యాన్ని సంతృప్తి పరుస్తుందన్న విషయం బీజేపీ గ్రహించిందని.. ప్రభుత్వం కూడా అందుకు తగ్టట్టు చర్యలు చేపట్టిందని.. ఫలితంగా మోడీ ఎప్పటిలాగే తన టాప్ ఇమేజ్ ను నిలబెట్టుకున్నారని బీజేపీకి చెందిన ఓ సీనియర్ నేత అభిప్రాయపడడం గమనార్హం. ఏదేమైనా సర్జికల్ స్ట్రైక్ వ్యవహారం యూపీ ఎలక్షన్స్ లో బీజేపీకి ఎంతమేర ఉపకరిస్తుందనేది రానున్న రోజుల్లో తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+