అన్నయ్యను బాధపెట్టినా: పని పూర్తిచేసిన పవన్!
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పన్ కళ్యాణ్ తాను వచ్చిన పనిని పూర్తి చేశారు! బిజెపి, టిడిపి కూటమికి అఖండ విజయాన్ని సాధించాలంటూ ఆయన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జోరుగా పర్యటించారు. సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమి విజయ ఢంకా మోగించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఘోర పరాజయం పాలైంది. కాంగ్రెసు పార్టీ నామరూపాలు లేకుండా పోయింది.
బిజెపి, టిడిపికి తాను ప్రచారం చేయడం తన సోదరుడు చిరంజీవిని బాధించిందని పవన్ అంగీకరించారు. కాంగ్రెసు పార్టీకి వ్యతిరేకంగా తాను చేసిన ప్రచారం అన్నయ్య చిరంజీవిని బాధపెట్టిన మాట వాస్తవమేనని చెప్పారు. అయితే కాంగ్రెస్ హటావో దేశ్ బచావో నినాదం నెరవేరినప్పటికీ కాంగ్రెస్ వేళ్లు ఇప్పటికీ మిగిలే ఉన్నాయని, వాటిని పూర్తిగా పెకిలిస్తానని చెబుతున్నారు.

కాంగ్రెసు పార్టీ చేసుకున్నంత ఫలితం అనుభవించిందంటున్నారు. కాంగ్రెసు చేసుకున్న ఫలితానికి ఆ పార్టీ నేతలు ఓడారని చెబుతున్నారు.
ఈ ఎన్నికల సమయంలో అన్నయ్య చిరంజీవిని బాధఇంచినా దేశ క్షేమమే ముఖ్యమన్నారు. తమ్ముడు సూపర్ హిట్, అన్నయ్య ప్లాప్ అనుకోవాలా అంటే.. అలా అనుకోవద్దని, సినిమాల జయాపజయాల గురించి తాను ఎక్కువగా ఆలోచించనని, ఇక రాజకీయాల్లోను వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications