Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆత్మహత్యల పరంపర: పట్టని అన్నదాత ఆవేదన

2000 నుంచి 2010 వరకు సుమారు ఏడు వేల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు తమ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ గత ఆరేళ్లలోనూ ఆత్మహత్యకు పాల్పడిన వారి సంఖ్య ఇంతకంటే ఎక్కువే .

చండీగఢ్: గురుప్రీత్ సింగ్, సందీప్ దుగ్గల్ మంచి స్నేహితులు. అందునా సోషల్ మీడియాలో ఫేస్ బుక్ అందుబాటులోకి వచ్చాక వారిద్దరికి 350 మందికి పైగా స్నేహితులు జత కలిశారు. ప్రస్తుతం యువతరం జాలీగా సాగుతూ ఎంజాయ్ చేస్తున్న తరుణం. కొందరి జీవితం వడ్డించిన విస్తరి అయితే.. మరి కొందరి జీవితం కష్టాల కడలి. గురుప్రీత్ సింగ్, దుగ్గల్ ఎన్ ఫీల్డ్ మోటారు సైకిల్ మీద తిరుగుతూ సన్ గ్లాసెస్ ధరించి సెల్ఫీ ఫొటోలు తీసుకుంటూ గడిపారు.

సందీప్ దుగ్గల్ ప్రొఫెల్ లో తనను తాను 'ఎండి, దీపక్ డాబా' అని చేర్చుకున్నాడు. కానీ సందీప్ దుగ్గల్‌తో పోలిస్తే గురుప్రీత్ సింగ్ పరిస్థితి అందుకు భిన్నమైంది. ఇది ఫేస్‌బుక్, యువతకు మధ్య అనుబంధాన్ని తెలియజేస్తుంది. సందీప్ దుగ్గల్ తల్లిదండ్రులుగానీ, తాత ముత్తాతలు గానీ వ్యవసాయం మాటెరుగరు. నగర శివార్లలో వ్యాపారంచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రత్యేకించి 'దీపక్ డాబా' అనే పేరుతో హోటల్ నడుపుతున్నారు.

ఇందులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 60 మందికి పైగా ఉద్యోగులు చాలా హ్యాపీగా పనిచేస్తున్నారని సందీప్ తెలిపాడు. గురుప్రీత్ సింగ్ తండ్రి సంగ్రూర్ జిల్లాలోని హమీర్ గఢ్ గ్రామ వాసి. ఒక రైతు కూడా. ఒకరోజు చేతికందినన్ని గుళికలు మింగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 47 ఏళ్ల వయస్సులోనే ఎలా జీవించాలని మదన పడుతూ ఆత్మహత్యకు పాల్పడటంతో ఆయన కుటుంబం ఆదుకునే వారు లేక అల్లాడుతోంది. గురుప్రీత్ సింగ్ చివరి రోజుల్లో బ్యాంకుల నుంచి వ్యవసాయం కోసం తీసుకున్న రుణం రూ.4.5 లక్షలకు చేరుకున్నది. కానీ ఆయన అనుకున్నట్లు పరిస్థితులు గురుప్రీత్ సింగ్ తండ్రికి అనుకూలించలేదు. ప్రస్తుతం తామెలా జీవించాలని గురుప్రీత్ సింగ్ ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు.

16 ఏళ్లలో 10 వేలు దాటిన ఆత్మహత్యలు

గురుప్రీత్ సింగ్ తండ్రి మాదిరిగానే 2000 నుంచి 2010 వరకు సుమారు ఏడు వేల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు తమ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కానీ గత ఆరేళ్లలోనూ ఆత్మహత్యకు పాల్పడిన వారి సంఖ్య ఇంతకంటే ఎక్కువే ఉంటుందని పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఎకనమిక్స్ విభాగాధిపతి సుఖ్ పాల్ సింగ్ తెలిపారు. ఆయన కేంద్రం తరఫున రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల గణాంకాలను సేకరించే కమిటీలో సభ్యుడు కూడా.

Punjab elections: The cycle of debts and farmer suicides blight India’s grain bowl

రైతుల పట్ల సర్కార్ చిన్నచూపు

ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలకు చేయూతనిస్తున్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఇందర్‌జిత్ జైజీ.. ఎన్నికలు జరుగుతున్నప్రస్తుత తరుణంలో రైతుల ఆత్మహత్యలపై సందేహాలను, ఎంతమంది బలన్మరణాలకు పాల్పడ్డారన్నసంగతి బయట పెడుతున్నాడు. సమస్య రెండు విధాలుగా ఉన్నదని ఆయన చెప్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలను తక్కువచేసి చూపుతుండటంతో 'దేశానికి గ్రెయిన్ బౌల్'గా నిలిచిన పంజాబ్ ప్రతిష్ఠ మసకబారుతోందని తెలిపారు. పంజాబీల ప్రతిష్ఠకు మచ్చ తెస్తున్నదని వ్యాఖ్యానించాడు.

ఆత్మహత్యల్లో రెండోస్థానం

రైతుల ఆత్మహత్యల్లో పంజాబ్‌ది రెండోస్థానం. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలను దాటేసి పంజాబ్ ముందుకు వచ్చింది. కానీ 2015లో పార్లమెంట్ కు సమర్పించిన గణాంకాల ప్రకారం 449 మంది రైతులు మాత్రమే పంజాబ్ లో ఆత్మహత్యలకు పాల్పడ్డారని ప్రభుత్వం తెలిపింది. ఇది మహారాష్ట్ర తర్వాత రెండో స్థానంలో ఉన్నదని చెప్తున్నది. రుణ భారం కారణంగానే రైతులు.. సన్నకారు రైతుల్లో 79 శాతం మంది రుణ భారం భరించలేక బలనవ్మరణాలకు పాల్పడ్డారు. వారంతా ఐదెకరాల లోపు భూమి గల వారే. ప్రస్తుతం సగటున పంజాబీ రైతుల రుణం రూ.8 లక్షలని అంచనా. దశాబ్ద కాలం క్రితం అది రూ.3 లక్షలు మాత్రమే. పంట రుణాలు తీసుకోని రైతులు ఉన్నారంటే సందేహమే మరి. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన రుణమాఫీ పథకం కింద కేవలం రెండు శాతం మంది మాత్రమే లబ్ది పొందారు.

పత్తి సాగుతో బలవన్మరణాలు మొదలు

1990వ దశకం చివరిలో పత్తి సాగు మొదలైనప్పటి నుంచి రైతుల ఆత్మహత్యల పరంపర మొదలైంది. పత్తి దిగుబడి పడిపోగా, ధరలు తగ్గిపోవడం ఒక కారణం. రాష్ట్రంలోని ఆగ్నేయ ప్రాంత రైతులు పూర్తిగా రుణాల ఊబిలో చిక్కుకుని దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 2005లో వ్యవసాయ రంగాన్నిప్రాధాన్య రంగంగా ప్రకటించిన బ్యాంకులు రెట్టింపు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కూడా సానుకూల నిర్ణయం తీసుకున్నాయి. వడ్డీ వ్యాపారులు, దళారులు, విత్తనాలు, రసాయన ఎరువుల వ్యాపారులను పక్కకు నెట్టేసి బ్యాంకులే రుణాలిచ్చేందుకు ముందుకు వచ్చారు. వడ్డీ వ్యాపారి అధిక వడ్డీ వసూలుచేయడంతోపాటు కఠినంగా వ్యవహరిస్తారన్నారు. కానీ ప్రారంభంలో బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు కేవలం రూ.లక్ష లోపేనని, తర్వాతీ కాలంలో బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా రుణాలివ్వడంతో రైతులపై భారం పెరిగిపోయిందని సుఖ్ పాల్ అనే రైతులు వాపోయాడు.

ప్రాఫిట్ తగ్గుదలే సమస్య

పత్తి సాగు వల్ల లబ్ది తగ్గుముఖం పట్టడమే కారణమని రైతులు పేర్కొంటున్నారు. రసాయనఎరువులు బారీగా వినియోగించడంతో ఖర్చులు పెరిగిపోయి వ్యవసాయం కష్ట సాధ్యమైన వ్రుత్తిగా రైతులు బావిస్తున్నారని భారతీయ కిసాన్ యూనియన్ సభ్యుడు పర్మీందర్ సింగ్ తెలిపారు.

హరిత విప్లవం వచ్చిన తర్వాత వివిధ రకాల విత్తనాల ఉత్పత్తితోపాటు నూతన సాగునీటి వసతుల కల్పన, శక్తిమంతమైన క్రిమి సంహారక మందులు అందుబాటులోకి వచ్చినా అత్యధికంగా రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకం, నీటి కొరత వంటి సమస్య వరి సాగుకు ఇబ్బందికరంగా మారిందన్నారు. ఇన్ పుట్ కాస్ట్ పెరిగిపోవడమే కాదు, పంటల సాగు ఖర్చుతోపాటు సాగు ధర పెరగక పోవడం మరొక కారణమని ఆయన చెప్తారు. పంటల సేకరణ ధర కనీసం 50 శాతం పెంచాలని పరిమిందర్ సింగ్ కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. తాము పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలుచేస్తే తప్ప వ్యవసాయానికి హామీ ఇవ్వలేమని రైతులు చెప్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+