సీమాంధ్రలో చిరుని పవన్ కాపాడేనా? (పిక్చర్స్)

హైదరాబాద్: సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ దాదాపు ఖాళీ అయిందని ఆ పార్టీ నేతలే చెబుతూ.. ఇతర పార్టీలలో చేరుతున్నారు. ఈ లోటును పూర్చేందుకే కొత్త పార్టీలు ఉపయోగపడతాయా? చూడాలి. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఎన్నికల బరిలో దిగనున్నారని వార్తలు వస్తున్నాయి.

కిరణ్, పవన్ సీమాంధ్ర ఎన్నికల బరిలో దిగితే అది కాంగ్రెసు పార్టీకి ఉపయోగపడుతుందా? ఉపయోగపడితే ఈ కొత్త పార్టీలు ఓట్లను చీల్చితే కాంగ్రెసు పార్టీకి ఏమాత్రం లబ్ధి చేకూరుతుందనేది ఎన్నికల తర్వాతనే తేలనుంది. పవన్ అన్న, కేంద్రమంత్రి చిరంజీవి కాంగ్రెసు నేత తెలిసిన విషయమే.

ఈ రెండు పార్టీలకు సీమాంధ్రే ప్రధాన సమరక్షేత్రం కానుంది. తద్వారా ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో ఆరు పార్టీల మధ్య ప్రధానంగా పోటీ జరిగే అవకాశం కనిపిస్తోంది. పొత్తులు, ఎత్తుల సంగతి పక్కన పెడితే, ప్రస్తుతానికి ప్రధానంగా ఆరు పార్టీలు ఎన్నికల బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తున్నాయి.

 పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

ప్రస్తుతమున్న కాంగ్రెస్, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, బిజెపిలతోపాటు కొత్తగా వచ్చే కిరణ్, పవన్ పార్టీలూ బరిలో ఉంటాయి. ఉభయ వామపక్షాలను కూడా కలిపితే 8 ప్రధాన పార్టీలున్నట్లు. లోక్‌సత్తా, ఎఎపి కూడా పోటీ చేయనుంది. వెరసి.. ఇన్ని పార్టీల మధ్య ఓటర్లు తమకు నచ్చిన పార్టీని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

చిరంజీవి

చిరంజీవి


పవన్ కల్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డిలు సీమాంధ్రలో పోటీ చేయనున్న నేపథ్యంలో కాంగ్రెసు పార్టీకి ఏమైనా లాభిస్తుందా అనేది ఎన్నికల తర్వాత తేలనుంది.

కిరణ్ కుమార్ రెడ్డి

కిరణ్ కుమార్ రెడ్డి

కొత్తగా పుట్టుకొస్తున్న పార్టీలు ఎవరి కొంపుముంచుతాయో అనే ఆందోళన ఇప్పుడున్న ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. కిరణ్ పార్టీ, పవన్ పార్టీ సీమాంధ్రలో ఎవరికి దక్కాల్సిన ఓట్లను చీల్చుతాయనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

బిజెపి

బిజెపి

ఎవరికి వారు ఈ ప్రభావం తమపై ఉండదంటూ లెక్కలు వేసుకుంటున్నారు. తెలంగాణలో ప్రధానంగా కాంగ్రెస్, తెరాస, టిడిపిల మధ్యే పోటీ ఉండే అవకాశం ఉంది. రాష్ట్ర విభజనకు లోక్‌సభ, రాజ్యసభల్లో మద్దతు ప్రకటించిన బిజెపి కూడా బలంగా దూసుకుపోయేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణకు మద్దతు పలికి ఆ ప్రాంతంలో, సీమాంధ్ర కోసం పోరాడి, ముఖ్య నేతల చేరికలతో సీమాంధ్ర ప్రాంతంలో బిజెపి ఉత్సాహంగా ఉంది.

జగన్

జగన్

వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో పాటు కొత్తగా వచ్చే కిరణ్, పవన్ పార్టీల ప్రభావం తెలంగాణలో పెద్దగా ఉండకపోవచ్చు. కొత్త పార్టీల ప్రభావమంతా సీమాంధ్రలోనే కనిపించనుంది.

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

గత ఎన్నికల ముందు ఏర్పాటై, ఆ తర్వాత కాంగ్రెస్‌లో కలిసిపోయిన ప్రజారాజ్యం పార్టీ అప్పట్లో టిడిపి విజయావకాశాలను బాగా దెబ్బతీసిందని విశ్లేషకులు చెబుతారు.

 సోనియా గాంధీ

సోనియా గాంధీ

ఈసారి కొత్త వస్తున్న కిరణ్, పవన్ పార్టీలు ఏం చేస్తాయి? కాంగ్రెస్, టిడిపి, జగన్ పార్టీలలో ఏ పార్టీ ఓటును ఏది చీల్చుతుంది? ఇది అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూర్చుతుంది? అనే అంశంపై చర్చలు జరుగుతున్నాయి. పార్టీల మధ్య పొత్తులు కుదిరితే సమీకరణాలు కూడా మారిపోతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+