సిటీలో ఢిల్లీ కేరింత: రాహుల్ ఏకాకీ! (పిక్చర్స్)

హైదరాబాద్: నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా రావడంతో ఆంధ్రప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటగా, పక్కనే ఉన్న గాంధీ భవన్ మాత్రం బోసిపోయింది. ఆదివారం ఫలితాలు రాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బిజెపి విజయం సాధించగా, ఢిల్లీలో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో బిజెపి రాష్ట నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

వచ్చే సార్వత్రిక లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి ఘన విజయానికి కారణం కాంగ్రెస్ అవినీతి పాలన అని వెంకయ్యనాయుడు అన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు నరేంద్రమోడీ నాయకత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారన్నారు. చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో బిజెపి గెలుపునకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే కారణమన్నారు.

చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు కాంగ్రెస్ నేతలను హత్య చేయడం వల్ల బస్తర్ ప్రాంతంలో కాంగ్రెస్ సానుభూతిపవనాలు వీచాయన్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అహంకార ధోరణితో వ్యవహరించిందన్నారు. సోనియా గాంధీ ఒంటెత్తు పోకడల వల్ల ప్రజలు ఆ పార్టీని ఏవగించుకుంటున్నారని, రాహుల్ గాంధీకి దేశానికి సంబంధించి సమస్యలపై సమగ్రమైన అవగాహన లేదన్నారు.

ఆనందం

ఆనందం

నాలుగు రాష్ట్రాల ఫలితాల అనంతరం నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో సంబరాలు జరుపుకుంటున్న ఆ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు.

హంగామా

హంగామా

నాలుగు రాష్ట్రాల ఫలితాల అనంతరం నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకుంటున్న ఆ పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు.

గెలిచామా!

గెలిచామా!

ఫలితాల అనంతరం నాంపల్లి పార్టీ కార్యాలయంలోని సంబరాల సందర్భంగా ఫోన్‌లో మాట్లాడుతున్న బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు.

విలేకరులతో..

విలేకరులతో..

కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం బిజెపి నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగినా ప్రజలు పట్టించుకోవడం లేదని, బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్ధి నరేంద్ర మోడీ అంటే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెంకయ్య విలేకరుల సమావేశంలో చెప్పారు.

బాణసంచా

బాణసంచా

నాలుగు రాష్ట్రాల ఫలితాల అనంతరం నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేశారు.

గాంధీ భవన్

గాంధీ భవన్

ఎప్పుడు నేతలతో హడావుడిగా కనిపించే హైదరాబాదులోని నాంపల్లి గాంధీ భవన్‌లో బోసిబోయిన దృశ్యం. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసు మట్టికరిచింది.

రాహుల్ ఏకాకి!

రాహుల్ ఏకాకి!

ఎప్పుడు నేతలతో హడావుడిగా కనిపించే హైదరాబాదులోని నాంపల్లి గాంధీ భవన్‌లో బోసిబోయిన దృశ్యం. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెసు మట్టికరిచిన విషయం తెలిసిందే.

ఆమ్ ఆద్మీ ఆనందం

ఆమ్ ఆద్మీ ఆనందం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు కైవసం చేసుకొని విజయ ఢంగా మోగించడంతో హైదరాబాదులో లక్డీకాపూల్ వద్ద ఆ పార్టీ నేతల ఆనందం.

మేం గెలిచాం

మేం గెలిచాం

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు కైవసం చేసుకొని విజయ ఢంగా మోగించడంతో హైదరాబాదులో లక్డీకాపూల్ వద్ద ఆ పార్టీ నేతల ఆనందం. ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తు చీపురుతో కార్యకర్తలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+