సోనియాకు కోపమొస్తుందనే జగన్ ట్రిక్స్!?

Why Jagan is not touring in Seemandhra?
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండి బయటకు రాగానే సమైక్యవాద జెండా భుజాన వేసుకొని, సీమాంధ్ర పర్యటనకు వెళ్తారని అందరూ భావించారని కానీ, బెయిల్ పైన విడుదలైన, రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు న్యాయస్థానం నుండి అనుమతి లభించినా జగన్ పర్యటించక పోవడం వెనుక కాంగ్రెసు పార్టీ అధిష్టానం స్క్రిప్ట్ ఉందా అంటే అవునని వార్తలు వస్తున్నాయి.

హైకమాండ్ స్క్రిప్ట్ ప్రకారమే జగన్ ట్రిక్స్ అంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక ఆంధ్రజ్యోతి కథనం రాసింది. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కోపం వస్తుందనే జగన్ సీమాంధ్ర పర్యటనకు డుమ్మా కొడుతున్నారని, హైదరాబాదులో ఉత్తిత్తి సమైక్య గర్జనలు నిర్వహించారని, అసెంబ్లీకి విభజన బిల్లు వచ్చే సమయానికి దేశాటకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోదని రాసింది.

కథనం ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు జగన్‌కు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఇదే అదనుగా జగన్ సీమాంధ్రలో పర్యటించి సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని పార్టీ శ్రేణులు భావించాయి. అయితే హైదరాబాద్‌లో విలేకరుల సమావేశాలు పెట్టడం తప్ప జగన్ సీమాంధ్ర పర్యటన ఊసెత్తడం లేదు. ఇప్పుడు, అప్పుడు అంటూ వాయిదాలతో కాలం గడుపుతున్నారు. అక్టోబర్ 30న కోర్టు సడలింపులు ఇచ్చి ఇప్పటికే పది రోజులు గడిచిపోయాయి.

సమైక్యం సంగతి పక్కనబెట్టినా, జగన్ ఇంతవరకూ వరద బాధిత ప్రాంతాలకూ వెళ్లలేదు. బెయిల్ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానంతో కుమ్మక్కైన నేపథ్యంలో, హైకమాండ్ అనుమతి లేనందు వల్లే జగన్ సీమాంధ్రకు వెళ్లడం లేదని తెలిసింది. "ఇప్పుడు జిల్లాల పర్యటనకు వెళ్తే సమైక్యవాదం- విభజన నిర్ణయం గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ప్రజలను సంతృప్తి పరచాలన్నా, పర్యటన సక్సెస్ కావాలన్నా భావోద్వేగాలను రెచ్చగొట్టడం, సోనియాను విమర్శించడం తప్పనిసరి. ఇదే జరిగే మేడమ్‌కు కోపం రావడం ఖాయం.

దీంతో ఇప్పుడీ గొడవంతా ఎందుకని జగన్ ఎప్పటికప్పుడు తన పర్యటన తేదీలను వాయిదా వేస్తున్నాడు'' అని ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. "సమైక్య ఉద్యమం ఇప్పుడే కాస్త సద్దుమణిగింది. విభజన ప్రక్రియను కొలిక్కి తెస్తున్న ఈ తరుణంలో ఆందోళనలు మళ్లీ ఊపందుకోవడం హైకమాండ్‌కు ఇష్టం లేదు. అందుకే జగన్‌ను అక్కడికి వెళ్లవద్దని ఆదేశించినట్టుంది'' అని కాంగ్రెస్ ముఖ్యుడొకరు అంచనా వేశారు.

సమైక్య వాదానికి జాతీయ నేతల మద్దతు కూడగట్టడం కోసం ఈనెల 26 నుంచి దేశవ్యాప్తంగా పర్యటిస్తానని జగన్ చెబుతున్నారు. 26వ తేదీనే ఆయన ఎందుకు ఎంచుకున్నారు? "ఈనెలాఖరులోగా రాష్ట్రానికి విభజన బిల్లు పంపుతామని కాంగ్రెస్ హైకమాండ్, కేంద్ర సర్కారు స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. 26న శాసనసభకు బిల్లు రానున్నట్టు సమన్వయ కమిటీ భేటీలోనే దిగ్విజయ్‌ స్పష్టం చేశారు. సరిగ్గా అదే సమయంలో జగన్ రాష్ట్రంలో లేకుండా ఉండేలా ప్లాన్ చేసుకుంటుండడం గమనార్హం. కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్కయ్యారనడానికి ఇది మరో నిదర్శనం'' అని రాజకీయ పరిశీలకుడొకలు విశ్లేషించారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+