జగన్, షర్మిల రోడ్ షో: టోపీ పెట్టిన కిరణ్(పిక్చర్స్)

విశాఖపట్నం/కృష్ణా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సీమాంధ్ర జిల్లాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కృష్ణా జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా, ఆ పార్గీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ విశాఖపట్నంలో జిల్లాలో పర్యటిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, జగన్ సోదరి షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

అధికారం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నారని, సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని జగన్ ఆరోపించారు. ఓట్లు, సీట్ల కోసం అడ్డమైన గడ్డి కరుస్తున్నారని జగన్ దుయ్యబట్టారు. అబద్ధాలు, వెన్నుపోట్లకు మారుపేరైన చంద్రబాబు నాయుడు కావాలో.. విశ్వసనీయత, నిజాయితీ కలిగిన తాను కావాలో ప్రజలే తేల్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి అన్నారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సంక్షేమ పాలన మళ్లీ రావాలంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని వైయస్ విజయమ్మ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ విశాఖపట్నంలోని మధురవాడ, ఆనందపురం, గాజువాక, పరవాడలో రోడ్ షో నిర్వహించారు. ఇది ఇలా ఉండగా జగన్ సోదరి షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటేసే ముందు దివంగత నేత వైయస్‌ను గుర్తు చేసుకోవాలని ప్రజలను కోరారు.

టిడిపి, జగన్ పార్టీల వల్లే విభజన: కిరణ్

కాగా, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగు జాతికి తీవ్ర నష్టం జరిగిందని కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు. విభజనకు కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వైకాపా పార్టీలే కారణమని మండిపడ్డారు. టిడిపి, జగన్ పార్టీలు ఇచ్చిన లేఖల వల్లే విభజన జరిగిందని ఆరోపించారు.

జగన్ ప్రసంగం

జగన్ ప్రసంగం

అధికారం కోసం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నారని, సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారని జగన్ ఆరోపించారు.

జగన్ అభివాదం

జగన్ అభివాదం

అబద్ధాలు, వెన్నుపోట్లకు మారుపేరైన చంద్రబాబు నాయుడు కావాలో.. విశ్వసనీయత, నిజాయితీ కలిగిన తాను కావాలో ప్రజలే తేల్చుకోవాలని జగన్మోహన్ రెడ్డి అన్నారు.

భారీగా హాజరైన జనం

భారీగా హాజరైన జనం

ఓట్లు, సీట్ల కోసం అడ్డమైన గడ్డి కరుస్తున్నారని చంద్రబాబు నాయుడిపై జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

గాజువాకలో విజయమ్మ

గాజువాకలో విజయమ్మ

ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయమ్మ విశాఖపట్నంలోని మధురవాడ, ఆనందపురం, గాజువాక, పరవాడలో రోడ్ షో నిర్వహించారు.

షర్మిల ప్రచారం..

షర్మిల ప్రచారం..

జగన్ సోదరి షర్మిల పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటేసే ముందు దివంగత నేత వైయస్‌ను గుర్తు చేసుకోవాలని ప్రజలను కోరారు.

టోపీ పెట్టుకుని కిరణ్ ప్రచారం

టోపీ పెట్టుకుని కిరణ్ ప్రచారం

జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

కిరణ్ అభివాదం..

కిరణ్ అభివాదం..

రాష్ట్రాన్ని విభజిస్తూ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల తెలుగు జాతికి తీవ్ర నష్టం జరిగిందని కిరణ్‌కుమార్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+