ఆ రెండు కులాలు, ఆ రెండు పత్రికలు


Y S Rajasekhar Reddyగతంలో వైఎస్ మాటి మాటికీ ఆ రెండు పత్రికలు అంటూ విమర్శించేవారు. కోస్తా ఆంధ్రకు చెందిన ఒక అగ్రకులం చేతుల్లో ఆ రెండు పత్రికలు ఉండడం, అవి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అదేపనిగా వార్తాకథనాలు రాయడం వైఎస్ కు చికాకు కలిగించి ఉండవచ్చు. ఇప్పుడు వైఎస్ స్వయంగా "సాక్షి" పత్రిక పెట్టుకుంటున్న నేపధ్యంలో ఆయన ఆ రెండు పత్రికల మీద దాడి చేయడం మానుకున్నారు.

రెడ్డి కులస్తులు ఈ రాష్ట్రాన్ని 32 ఏళ్ళు, కమ్మ కులస్ధులు 16 ఏళ్ళు పరిపాలించారని, జనాభాలో అత్యధిక శాతం ఉన్న బిసి,ఎస్ సి, ఎస్ టిలు రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నారని బలహీనవర్గాల సాధికార వేదిక గత కొంతకాలంగా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఈ వేదిక చైర్మన్ గా మాజీ ఐఎఎస్ అధికారి కాకి మాధవరావు వ్యవహరిస్తున్నారు. ఈ వేదికకు కొందరు ప్రొఫెసర్లు బాసటగా ఉన్నారు. చిరంజీవి పార్టీకి ఈ వేదిక వెలుపలి నుంచి మద్దతు ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+