బాలీవుడ్ నటి అమీషా పటేల్ విక్రమ్ భట్ ల మధ్య ప్రేమబంధం బెడిసికొట్టిందట. వీరిద్దరి మధ్య రోమాన్స్ తారాస్థాయికి చేరుకుంది. వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ప్రబలంగా ప్రచారంలోకి వచ్చింది. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని హాయిగా సంసారం చేసుకుందని వారిద్దరు గట్టిగానే బాసలు చేసుకున్నారు. ముంబయిలో ఒక అపార్టుమెంటు కొనడానికి సీరియస్ గానే ప్రయత్నించారు. అయితే తమ మధ్య సంబంధం తెగిపోయిందని విక్రమ్ భట్ తేల్చేశాడు. అతను ఇదివరకే పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ సంబంధం ముళ్ల మీద నడుస్తోంది. అయితే విఫల వివాహం ఎటూ తేలడం లేదట. ప్రియుడితో దూరమైన అమీషా మళ్లీ సినిమాల్లో తన చోటు కోసం కాలు పెట్టిందని ప్రచారం. ఆమె చంద్రముఖి హిందీ రీమేక్ సినిమాలో నటించింది. ఆమె తమిళంలో జ్యోతిక పోషించిన పాత్రను హిందీలో పోషించింది. ఇదే సమయంలో ఫిల్మ్ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టాలని అమీషా బాయ్ ఫ్రెండ్ సీరియస్ గా ఆలోచిస్తున్నాడట.