ప్రేమలో పడిన శ్రియ

అందాల తార శ్రియ ప్రేమలో పడిందట. ఆమె ప్రస్తుతం ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్ అనే హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో తనతో పాటు నటిస్తున్న జసె మెట్ కాల్ఫ్ తో ఆమె ప్రేమాయణం సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చాలా సార్లు వీరద్దరు కలిసి వుండగా చూసినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. భారత్ వచ్చినప్పుడు జెస్ కు శ్రియా అనేక ప్రదేశాలు దగ్గరుండి చూపించిందట. గతంలో ఒకసారి విమానం కోసం శ్రియ పడిగాపులు పడుతుంటే జెస్ కంపెనీ ఇచ్చాడని కూడా చెబుతున్నారు. ఏమైనా వీరిద్దరి మధ్య ప్రేమ ముదిరి పాకాన పడుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications
