బాలయ్య పూర్ షో

Balakrishna
బాలకృష్ణ చిత్తూరు జిల్లా పర్యటన విజయవంతం కాకపోవడంతో చంద్రబాబు నాయుడు అసహనానికి గురవుతున్నట్టు తెలిసింది. బాలకృష్ణ వెంట చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ నాయకులు ఉన్నా జనం పెద్ద సంఖ్యలో రాకపోవడానికి కారణమేమిటని చంద్రబాబు ఆరా తీసినట్టు తెలుస్తోంది. ఎండలు మండిపోతున్నందువల్లనే జనం రాలేకపోతున్నారని జిల్లా తెలుగుదేశం నాయకులు సంజాయిషీ ఇచ్చుకున్నట్టు సమాచారం.

జూనియర్ ఎన్టీఆర్ తో పోల్చుకుంటే బాలకృష్ణ రోడ్ షోలకు జనం తక్కువగా హాజరవుతున్నమాట వాస్తవం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెలుగుదేశం నాయకులు పెద్దగా శ్రద్ధ తీసుకోకపోయినా ఎన్టీఆర్ రోడ్ షోలకు జనం భారీ ఎత్తున హాజరయ్యారు. రాయలసీమలో బాలకృష్ణకు అభిమానుల నుంచి గొప్ప ఆదరణ ఉంటుందని భావించినా అందుకు విరుద్ధంగా జరగడంతో చంద్రబాబు కలవరం చెందుతున్నారు. జూనియర్ బదులు బాలకృష్ణనే రాష్ట్ర మంతటా తిప్పాలని చంద్రబాబు నాయుడు వేసుకున్న ప్రణాళిక నీరసించిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.

చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ నాయకురాలు గల్లా అరుణకుమారి కుటుంబంపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీస్తున్నాయి. బాలయ్యపై గల్లా అరుణ నిన్న విరుచుకుపడ్డారు. తమ కుటుంబ నేపధ్యం తెలుసుకోకుండా బాలకృష్ణ విమర్శలు చేయడం సముచితం కాదని ఆమె అన్నారు. తమ కుటుంబం రాజకీయాల్లోకి రాకముందే వ్యాపారాల్లో స్ధిరపడి ఉందని, ఆ విషయం చంద్రబాబు నాయుడికి బాగా తెలుసని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+