పోలీసు శాఖలో కులాల కుమ్ములాట!

ఈ సమయంలో ఆక్టోపస్ డిజిపిగా వచ్చిన మహంతి ఎస్ ఎస్‌పి యాదవ్ వ్యవహారశైలి నచ్చక తీవ్రంగా వ్యతిరేకించే వారు. ఈ సమయంలో అరవిందరావు, యాదవ్ ఇద్దరు కలిసి మహంతిని ఆక్టోపస్ నుంచి తప్పించేందుకు తమదైన శైలిలో చక్రం తిప్పారు. అప్పటి వరకు విబేధాలున్నప్పటికీ, బయట పడకుండా నిఘాబాస్ - పోలీసు బాస్ లు వ్యవహరించేవారు. అనంతరం యాదవ్ సైతం అరవిందరావుపై అనుమానాలు రోజు రోజుకూ పెంచుకోవడం ఎక్కువయింది. మీడియాలో వ్యతిరేక కథనాలతో పాటు ముఖ్యమంత్రి వద్ద తనకు వ్యతి రేకంగా అరవిందరావు మినహా ఎవరూ చెప్పలేరనే అపోహతో ఆయనను విమర్శించే స్థాయికి వచ్చినట్లు పోలీసులు చెబు తారు. అదే విధంగా ఇంటెలిజెన్స్ ఛీఫ్‌గా అరవిందరావు డిజిపి ఛాంబర్‌కు వెళ్తే అనుమతి లేకుండా ఎలా వచ్చావని ప్రశ్నించిన సంఘటనలు కూడా జరిగాయి. సరిగ్గా ఏడాది క్రితం డిజిపి, అరవిందరావు మధ్య అంతరం పెరిగిపోయింది.
ముఖ్యంగా ఈ యేడాది ప్రథమార్థంలో ఎసిబి డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న ఆర్.ఆర్.గిరీశ్‌కుమార్ ఇంటెలి జెన్స్ బాస్ దగ్గరి బంధువులు. జనవరి మాసంలో గిరీశ్‌కు మార్‌కు డిజిపిగా పదోన్నతి లభించాల్సి ఉంది. ఈ క్రమంలో సౌమ్యుడిగా పేరుగాంచిన గిరీశ్‌కుమార్‌ను డిజిపి చేయాలని అరవిందరావు ప్రయత్నించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి యాదవ్ వర్సెస్ అరవిందరావుగా రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో డిజిపి యాదవ్ పదోన్నతుల వ్యవహారం లో అడ్డుకట్ట వేస్తున్నాడనే ఆరోపణలు బలంగా వినిపించాయి. ఇదే సమయంలో అరవిందరావుకు వ్యతిరేకంగా ఐపిఎస్ అధికారి సుందర్‌కుమార్ దాస్‌తో సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసే స్థాయి వరకు వీరి మధ్య కుమ్ములాటలు వెళ్ళి నట్లు పోలీసు వర్గాలు బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
ఎన్నికల వేళ ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని మెచ్చుకుని యాదవ్ మరోసారి వివాదాల సుడిగుండంలోకి వెళ్ళగా, ముఖ్యమంత్రి అనుగ్రహం అనుకూలంగా మారింది. ఈ సమ యంలో నియమితులైన మహంతి తెలుగుదేశం పార్టీ అనుకూల వ్యక్తిగా ముద్రపడటంతో ముఖ్యమంత్రి మరోసారి యాదవ్‌కు అవకాశాన్ని కల్పించారనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో తనకు వ్యతిరేకంగా పనిచేశారని మేహశ్‌చంద్రలడ్డా వంటి సమర్ధవంతులైన అధికారులపై కూడా చర్యలు చేపట్టారు. ‚టీడీపీ హయాంలో పనిచేసిన పోలీసు అధికారులను లూప్‌లైన్‌లకే పరిమితం చేయడం వల్ల కూడా యాదవ్ వై.ఎస్.కు దగ్గరయ్యాడన్నే చర్చ ఉంది. దీంతో ఇద్దరు బాస్‌ల వర్గ పోరాటాల్లో పోలీసు ఉన్నతాధికారులు సమిధలవుతున్నారు.
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
కేటీఆర్ చుట్టూ కొత్త వివాదం, ఏం జరుగుతోంది..!! -
హైదరాబాద్‌లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!!












Click it and Unblock the Notifications