కుప్పంలో బాబుకు ఎదురు

తిరుపతిలో చిరంజీవి ఎదురీదుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి కరుణాకర్ రెడ్డి అన్ని పార్టీల్లోని రెడ్డి నాయకుల మద్దతును సమీకరించుకున్నట్టు తెలుస్తోంది. అందుకే చిరంజీవి చివరి రెండు రోజులూ తిరుపతిలోనే మకాం వేసి గెలుపు కోసం బాగా కష్టపడవలసి వచ్చింది. ఇక్కడ పోలింగ్ శాతం తక్కువగా ఉండడం కాంగ్రెస్ అభ్యర్ధి కరుణాకర్ రెడ్డికి కలిసి వచ్చే అంశమని చెబుతున్నారు. తెలుగుదేశం అభ్యర్ధి సీరియస్ గా ప్రచారం చేయకపోవడం కూడా కాంగ్రెస్ కు మంచిదంటున్నారు. పాలకొల్లులో కూడా చిరంజీవి గెలుపు అంత ఈజీ కాదని వినిపిస్తోంది. అక్కడ ఆయనకు తెలుగుదేశం అభ్యర్ధి అయిన డాక్టరుకు హోరాహోరీ పోరు సాగింది. చిరంజీవి ఓడినా, గెలిచినా అతికొద్ది ఓట్ల వ్యత్యాసంతోనే అని పరిశీలకులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications