ఎన్టీఆర్, చిరు సిన్మాలపై నిషేధం?

ఎన్నికల సమయంలో దూరదర్శన్‌లో రాజకీయ పార్టీల నేతల సినిమాలను ప్రదర్శించరాదనే నిబంధన చాలాకాలంగా అమలులో ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. ప్రైవేటు టీవీ ఛానళ్లలో ఇలాంటి నిబంధన లేదని ఇప్పుడు వాటిలోనూ నిషేధం ఉండాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. చిరంజీవి, పవన్, బాలకృష్ణ, జూ.ఎన్టీఆర్‌లు తమ పార్టీల తరఫున పెద్దఎత్తున ప్రచారం సాగిస్తున్నారు. వీరి సినిమాల ప్రదర్శనను ఎన్నికలయ్యేవరకు ప్రైవేటు ఛానళ్లలోనూ నిలిపివేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించబోతోంది. దీనిపై శనివారం కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ఆర్థిక మంత్రి రోశయ్య పార్టీ నేతలతో చర్చించారు. సోమవారం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు ఇవ్వాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications