వైఎస్ జగన్ యాత్ర విజయవంతం కావడంతో సంక్షోభం

YS Jagan
జగన్ యాత్ర విజయవంతం కావడంతో మంత్రుల్లో, ఎమ్మెల్యేలలో గుబులు పట్టుకుంది. జగన్‌ ఓదార్పు యాత్ర నేపథ్యంలో తటస్థంగా ఉన్న కాంగ్రెస్‌ శాసనసభ్యులకు కొత్త దిగులు పట్టుకుంది. అధిష్ఠానం-రోశయ్య-జగన్‌ మధ్య జరుగుతున్న దోబూచులాట, ఆధిపత్యపోరు కారణంగా మౌనం వహిస్తోన్న కాంగ్రెస్‌ ఎమ్మె ల్యేలు, జగన్‌ వ్యతిరేకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి నేతలు జగన్‌ యాత్రకు భారీ జన సమీకరణ చేసి తీసుకు వెళుతుండటం సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కలవరం కలిగిస్తోంది. జగన్‌ ఓదార్పు యాత్రకు ఆయన వెళుతున్న జిల్లాల నుంచి మాత్రమే కాకుండా.. ఇతర జిల్లాల నుంచి కూడా భారీ జన సమీ కరణ జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే, పార్టీలో కొన సాగుతున్న గందరగోళం వల్ల తటస్థంగా వ్యవహరిస్తోన్న ఎమ్మె ల్యేలు ఎటూ మొగ్గకుండా మౌనంగా ఉన్నారు. మరోవైపు జగన్‌ వ్యతిరేక ఎమ్మెల్యేలయితే కావాలనే దూరంగా ఉంటున్నారు. అయితే.. వారు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు తరలివెళుతుండటం ఎమ్మెల్యేలను కలవర పరుస్తోంది.ఈ పరిణామాలు ముదురుపాకాన పడితే స్థానికంగా పట్టు పోతుందన్న భయం మొదలయింది. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి విఫలమయిన నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గా ల్లోని ఒకటి రెండు మండలాల్లో హవా ఉన్న నేతలతోపాటు, ఇప్పటి నుంచే ఎదుగుదామనుకుంటున్న యువ నేతలు జగన్‌ యాత్రకు కార్యకర్తలతో యాత్రకు తరలివెళుతున్నారు. వీరిలో అధిక శాతం నేతలు ఇప్పటివరకూ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల వెనుకే ఉన్నారు. జగన్‌ కొత్త పార్టీ పెట్టే వ్యూహంతోనే యాత్ర నిర్వహిస్తున్నారన్న ప్రచారం జరుగు తుండటంతో తమ రాజకీయ భవిష్యత్తును కొత్త పార్టీ నుంచి మొదలుపెట్టాలన్న ఆశ ఉన్న నేతలు, ఇప్పటినుంచేజనబలం ప్రదర్శించే పనిలో ఉన్నారు. ఇది అధికార పార్టీ ఎమ్మెల్యేలలో గుబులు పుట్టిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+