ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ విజయాన్ని సాధించి పెట్టిన భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని మీడియా వెంటాడుతూనే ఉన్నది. విజయానికి మీడియా ఆయనను ఎడతెగని ప్రశంసలతో ముంచెత్తుతుంటే, ఆయన భార్య ఫొటోలు నెట్ లో కనిపించి కలవరపెడుతున్నట్లే ఉన్నాయి. ధోనీ భార్య సాక్షి ఫొటోలు నెట్లో దుమ్ము రేపుతున్నాయి. మిడ్డే ఇటీవల సాక్షికి చెందిన రెండు ఫొటోలను నెట్లో పెట్టింది. అందులో ఒకటి ఓ మిత్రురాలిని కౌగలించుకుంటూ స్మోకింగ్ చేస్తున్న ధోనీ భార్య కనిపిస్తోంది. మరో చిత్రంలో తన మిత్రురాలితో పాటు తాను ఓ యువకుడిని కౌగలించుకుంటూ ఫోజు ఇచ్చిన ఫొటో. ఈ ఫొటోలు ధోనీ భార్య కాలేజీలో చదువుతున్నప్పటవని ఆ వెబ్ పత్రిక వ్యాఖ్యానించింది. వాటిని ఓ రీడర్ తమకు పంపాడట. పాత వాటిని తవ్వి కొత్త గాయం చేయడమెందుకని అడిగితే వ్యూయర్స్ కు కనువిందు చేయడమే తమ ఉద్దేశమని చెప్పి తప్పించుకోవచ్చు. గతంలో ధోనీ తమిళ నటి లక్ష్మీ రాయ్ తో డేటింగ్ చేస్తున్నాడని, బాలీవుడ్ నటి దీపికా పడుకొనేతో కలిసి తిరుగుతున్నాడని మీడియా ఊహాగానాలు ప్రచారం చేసింది. ఆ సమయంలో ధోనీ వివాహం వ్యవధి లేకుండా, హఠాత్తుగా జరిగిపోయింది. ఇంత హఠాత్తుగా పెళ్లి చేసుకున్న ధోనీ వ్యవహారానికి మీడియా విస్తుపోయింది. అందుకు కూడా కారణాలను అన్వేషించి ఊహాగానాలు ప్రచారం చేసింది. ఏమైనా, సెలబ్రిటీలకు ఇటువంటి తిప్పలు తప్పవు.