కేంద్ర ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గం ప్రతినిధిగా కేంద్ర మంత్రి పురంధేశ్వరి పని చేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కమ్మ సంఘం సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరు కావడంపై మిగతా సామాజిక వర్గాల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. కులాభిమానం ఉండాలి గానీ దురభిమానం ఉండకూడదని ఆమె ఆ సమావేశంలో అన్పప్పటికీ ఆమె కుల పక్షపాతం బయటపడిందని అంటున్నారు. తెలుగు సమాజంలో కమ్మ సామాజిక వర్గం పెద్ద యెత్తన లాభపడింది. పారిశ్రామికంగా వారిదే పైచేయిగా ఉంది. ప్రభుత్వాలను ప్రభావితం చేయగల శక్తి ఆ సామాజిక వర్గానికి ఉండడమే కాకుండా వారికి ప్రతినిధులుగా కొంత మంది ప్రతి పార్టీలో ఉంటారని అంటారు. అలా కాంగ్రెసు ప్రభుత్వంలో వారి ప్రతినిధిగా పురంధేశ్వరి పనిచేస్తున్నారని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోవడం వల్ల, ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు ప్రాబల్యం తగ్గడం వల్ల ఆ సామాజిక వర్గానికి దగ్గుపాటి పురంధేశ్వరి అవసరం ఆ సామాజిక వర్గానికి ఇతోధికంగా ఏర్పడింది. దీంతో చంద్రబాబు కన్నా పురంధేశ్వరిదే పైచేయిగా ఉంటోంది.