చంద్రబాబు హెల్త్ మిస్టరీ

అయితే, మొదటి రోజు మాత్రమే సెలైన్ ఎక్కించామని వైద్యులు చెబుతున్నారని చెప్పింది. చంద్రబాబు స్థితిగతులన్నీ సాధారణంగానే ఉన్నాయని నిమ్స్ వైద్యులు చెబుతున్నారని సాక్షి టీవీ చానెల్ చెబుతోంది. నిమ్స్ లో ప్రైవేట్ వైద్యులు చంద్రబాబు ఆరోగ్యాన్ని సమీక్షిస్తున్నట్లు తెలిపింది. చంద్రబాబు గంట గంటకూ నీళ్లు తాగుతున్నట్లు లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ బుధవారం చెప్పారు. కాగా, టీవీ9 చానెల్ మరో వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. చంద్రబాబు క్రమం తప్పకుండా యోగా చేస్తున్నారని, నిపుణులు చంద్రబాబు చేత యోగా చేయిస్తున్నారని, అందువల్లనే చంద్రబాబు ఇన్ని రోజులుగా దీక్ష చేయగలుగుతున్నారని ఆ వార్తాకథనం ప్రసారం. చంద్రబాబు దైవాంశ సంభూతుడు కావచ్చునని, ఇన్ని రోజులుగా నార్మల్ గా ఉన్నారంటే అదే కారణం కావచ్చునని వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ వ్యాఖ్యానించారు. చంద్రబాబు దీక్షను కించపరచడానికే బురద చల్లుతున్నారని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. నిజం, నిమ్స్ వైద్యులకు తెలుసు.












Click it and Unblock the Notifications