సీతయ్య లేఖలే రాస్తాడు

ఇంతకీ ఏమిటా కారణమంటే, మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంలో తడబాటును తట్టుకోలేక, మీడియా ప్రతినిధులు వేసే ప్రశ్నలకు స్పాంటేనియస్ గా సమాధానాలు ఇవ్వడంలో ఎదురయ్యే ఇబ్బందులను గ్రహించి ఆయన బహిరంగ లేఖలను తన అస్త్రాలుగా సీతయ్య వాడుకుంటున్నారని గిట్టనివారంటున్నారు. హరికృష్ణ బహిరంగ సభల్లోనే ఎక్కువగా మాట్లాడుతారు. మీడియాను ఫేస్ చేసేది చాలా తక్కువ. ఒక్కవేళ మీడియాతో మాట్లాడాల్సి వస్తే తాను మాట్లాడదలుచుకుంది చెప్పేసి వారి నుంచి ప్రశ్నలు వచ్చేలోగా వెళ్లిపోతారని ఆయనపై ఓ అపప్రథ ఉంది. ఏమైనా, ఎవరికి ఏది ఇష్టమో అది చేస్తారు. హరికృష్ణను ఈ విషయంలో తప్పు పట్టడం సరి కాదేమో.












Click it and Unblock the Notifications