కిరణ్‌పై కత్తులు నూరుతున్న బొత్స

ముఖ్యమంత్రి నిర్లిప్త వైఖరి వల్లనే 29 మంది శానససభ్యులు జగన్ వైపు వెళ్లారని బొత్స అధిష్టానానికి పూసగుచ్చినట్లు వివరించారని అంటున్నారు. పది, పన్నెండు మంది శాసనసభ్యులకు మించి జగన్ వైపు వెళ్లబోరని కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి చెప్పారని, అయితే ఆ సంఖ్య 29కి పెరిగిందని, జగన్ వైపు వెళ్తారని భావించే శాసనసభ్యులతో కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడకపోవడం వల్లనే అలా జరిగిందని బొత్స చెప్పినట్లు సమాచారం. ఏమైనా, బొత్సకు 2014లోపలే ముఖ్యమంత్రి కావాలనే ఆశ రోజు రోజుకూ పెరుగుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications