జగన్ గుట్టు విప్పిన సిబిఐ?

YS Jagan
సిబిఐ తన ప్రాథమిక విచారణలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక లావాదేవీల గుట్టును విప్పినట్లు చెబుతున్నారు. జగన్‌పై వచ్చిన ఆస్తులపై ఆరోపణలకు రుజువులున్నాయని సిబిఐ అభిప్రాయపడినట్లు ఓ ప్రముఖ దినపత్రిక వార్తాకథనం సారాంశం. సిబిఐ మంగళవారం జగన్ ఆస్తుల వ్యవహారంపై సీల్డ్ కవరులో తన ప్రాథమిక విచారణ నివేదికను హైకోర్టుకు అందించింది. అనుమతి ఇస్తే జగన్ పెట్టుబడుల వ్యవహారంపై పూర్తి స్థాయి జరుపుతామని కూడా సిబిఐ తన నివేదికలో చెప్పినట్లు ఆ పత్రిక రాసింది.

హవాలా మార్గంలో జగన్ సంస్థల్లోకి పెట్టుబడులు వచ్చాయని, పెట్టుబడుల రూపంలో జగన్ లంచాలు రాబట్టారని సిబిఐ తేల్చినట్లు ఆ ప్రతిక రాసింది. ఈ మేరకు బుధవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ప్రతి పెట్టుబడి వెనకా ప్రయోజనం దాగి ఉందని సిబిఐ అభిప్రాయపడినట్లు చెప్పింది. ఇక, హైకోర్టు ఏం చేస్తుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+