వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జగన్‌పై ఒత్తిడికి చంద్రబాబు డ్రామా?

తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అనుమతి పొందదనే విషయం తెలిసే ఆయన ఆ విధంగా చేశారని అంటున్నారు. అనుమతి పొందకూడదనేదే ఆయన ఉద్దేశమని చెబుతున్నారు. చంద్రబాబుకు ప్రస్తుత పరిస్థితిలో ప్రభుత్వాన్ని పడగొట్టడం ఇష్టం లేదనే విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కోవాల్సి వస్తే రాష్టంలోని రెండు ప్రాంతాల్లో తాను ఓడిపోయే ప్రమాదం ఉందని ఆయన ఎప్పుడో గ్రహించారు. అయితే, వైయస్ జగన్ వైపు నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఆయన అవిశ్వాసం డ్రామాను నడిపించారని అంటున్నారు. తాను ప్రభుత్వంతో కుమ్మక్కు కాలేదని చెప్పుకోవడానికి అలా చేశారని అంటున్నారు. అయినా, చంద్రబాబును ప్రజలు నమ్ముతారా అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు అంటున్నారు. ఎవరి వ్యూహం ప్రకారం వారు పనిచేస్తారని సర్గుకుపోవాల్సి ఉంటుంది.