సీమాంధ్ర నేతలకు బ్రెయిన్ వాష్

తెలంగాణ విషయంలో చిదంబరం ప్రభుత్వపరమైన కోణంలో ఆలోచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన 2009 డిసెంబర్ 9వ తేదీన ప్రకటించారు. ఆ తర్వాత సీన్ రివర్సైంది. ఇప్పటికీ ఆయన ప్రభుత్వపరంగా ఆలోచిస్తున్నారని అంటున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై కచ్చితమైన వైఖరిని ప్రకటించాలని ఆయన అడుగుతున్నారు. మిగతా కాంగ్రెసు అధిష్టానం పెద్దలు పార్టీపరంగా ఆలోచన చేస్తున్నారు. అందుకే, మిగతా నేతల వద్ద ఎదురుకాని వ్యతిరేకత సీమాంధ్ర నేతలకు చిదంబరం వద్ద ఎదురైనట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications