జగన్ వర్గం ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి సేఫ్?

విలీనం ఒప్పందంపై తాను సంతకం చేయలేదని, అందువల్ల తనను ఒకదాన్ని ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించాలని ఆమె స్పీకర్‌కు పెట్టుకున్న పిటిషన్‌లో అన్నారు. ఆమె విజ్ఞప్తిని స్పీకర్ పరిగణనలోకి తీసుకుంటే ఆమెపై అనర్హత వేటు పడే అవకాశాలు లేవు. ఇదిలా వుంటే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున శోభా నాగిరెడ్డిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ప్రజారాజ్యం స్పీకర్‌కు పెట్టుకున్న పిటిషన్ కూడా పెండింగులో ఉంది. ఏమైనా, శోభా నాగిరెడ్డి సేఫ్‌గా బయటపడుతారా, అనర్హతకు గురవుతారా అనేది వేచి చూడాల్సిందే.












Click it and Unblock the Notifications