జగన్ సాక్షిపై శంకర్రావు చిందులు

మరోసారి విమర్శించారు. పలువురి నుండి తనకు బెదిరింపు కాల్సు వస్తున్నాయని ఆయన అన్నారు. ఎవరి నుండి బెదిరింపు కాల్సు వచ్చినా అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలన్నదే తన లక్ష్యమని శంకర్ రావు స్పష్టం చేశారు. గతంలోనూ శంకర్ రావు తనకు బెదిరింపు కాల్సు వస్తున్నాయని పోలీసులపై గుర్రుమన్న విషయం తెలిసిందే. తనకు బెదిరింపు కాల్సు వస్తున్నాయని చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
ఓ సమావేశంలో సీరియస్‌గా మాట్లాడుతున్న సమయంలో ఫోన్ ఇచ్చిన పిఎ చెంప చెల్లుమనిపించారు. మరోసారి ఏకంగా మీడియాపై చిందులు తొక్కారు. మీడియా ఇష్టం వచ్చినట్లు రాస్తే మీడియాను బహిష్కరిస్తానని హెచ్చరించారు. తాను ఓ మంత్రి అయి ఉండి మంత్రివర్గంపైనా కామెంట్ చేసిన ఘనత శంకర్ రావుది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో అవినీతిపరులు ఉన్నారని అందరూ రాజీనామాలు సమర్పిస్తే మరోసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వైయస్ కుటుంబంపై ఆరోపణలు చేయడమే కాకుండా కోర్టుకు సైతం వెళ్లిన శంకర్ రావు అదే జగన్‌ను హైకమాండ్ ఆదేశిస్తే జగన్‌ను పార్టీలోకి తీసుకు వస్తానని చెప్పారు. కడప ఉప ఎన్నికలలో జగన్‌పై కాంగ్రెసు అభ్యర్థిగా పోటీ చేస్తానని సైతం ప్రకటించారు.












Click it and Unblock the Notifications