సత్య సాయి ఆస్పత్రికి వాస్తు దోషం

ఈ ఆస్పత్రిలో బాబా అన్నయ్య రత్నం శేషం రాజు 1984లో మరణించారు. సాయిబాబా సోదరి వెంకమ్మ 1993లో మరణించింది. ఆ తర్వాత నాలుగేళ్లకు మరో సోదరి పార్వతమ్మ ఇదే ఆస్పత్రిలో చనిపోయింది. పార్వతమ్మ మనవరాలు చేతన రాజు ఇంట్లోనే సత్య సాయిబాబాకు వంటలు చేసి పంపించేవారు. ఆమె ఈశ్వరమ్మ మహిళా సంక్షేమ ట్రస్టుకు నేతృత్వం వహిస్తోంది. బాబా సోదరుడు జానకీ రామయ్య కూడా సత్య సాయిబాబా మరణించిన ఐసియులో మృతి చెందాడు. సత్య సాయి సెంట్రల్ ట్రస్టులో జానకీ రామయ్య కీలక పాత్ర పోషించేవారు. జనకీ రామయ్య కుమారుడు ఆర్.జె. రత్నాకర్ ప్రస్తుతం ట్రస్టు సభ్యుడు. రత్నాకర్ తల్లి మీనాక్షమ్మ సాయిబాబాకు అందరికన్నా సన్నిహితురాలు. ఆమె ఇంటి నుంచే బాబాకు రాగి ముద్ద, వేరుశనగ పచ్చడి వచ్చేవి.












Click it and Unblock the Notifications