జగన్ బూచి: కడప కాంగ్రెసు నేతల చాలుబాజీ

ఆ కారణంగానే రాష్ట్రంలోని ఏ జిల్లాకు కూడా దక్కని పదవులు కడప జిల్లాకు దక్కాయని అంటున్నారు. పదవులు దక్కించుకున్న నేతలు కడప జిల్లాలో ఎక్కువగా ఉన్నారని లెక్కలు తీస్తున్నారు. ముగ్గురికి రాష్ట్ర మంత్రి పదువులు దక్కాయి. అదే హోదాగల 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ పదవి కడప జిల్లాకే దక్కింది. అయినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత జగన్ వల్ల కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చే పరిస్థితి కనిపించలేదు.
గత రెండేళ్లుగా ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నేతలు సత్తా చూపించలేకపోయారు. గడిచిన రెండేళ్లలో కడప పార్లమెంటు, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ ఆరు మాసాల క్రితం ఉప ఎన్నికలు జరిగిన రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి వలస వచ్చిన ఓ నేత, కాంగ్రెస్‌లో విలీనమైన ప్రజారాజ్యం పార్టీ నేతలు పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇటు రెడ్డి అటు బలిజ సామాజికవర్గాలకు చెందిన నాయకులే పోటీ పడుతూ పదవులు దక్కించుకుంటుండడంతో మిగతా సామాజిక వర్గాల్లో అసంతృప్తి నెలకొందని అంటున్నారు.
కొత్తగా పదవులు ఆశించే వారిలో కూడా ఆ సామాజికవర్గాల నేతలే ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఎన్ వరదరాజులురెడ్డి, డాక్టర్ వి శివరామకృష్ణారావు, కందుల శివానందరెడ్డి, ఆర్ రమేష్‌కుమార్‌రెడ్డి, ఎం నారాయణరెడ్డిలతోపాటు ఉప ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఎం రాంప్రసాద్‌రెడ్డి, మేడా వెంకట మల్లికార్జునరెడ్డి, కె ఈశ్వరయ్య, పులివెందుల అధికార పార్టీ ఇన్‌చార్జి కందుల రాజమోహన్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాకం అశోక్‌కుమార్, రాజోలి వీరారెడ్డి, పటాన్ మహ్మద్‌ఖాసీం పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications