'ఇద్దరు మిత్రుల'తో ట్రస్ట్ నుండి లోకేష్ చక్రం?

అయితే ఇప్పటి నుండి పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాలపై లోకేష్ దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లోకేష్ కోసం ఓ కార్యాలయాన్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారని అంటున్నారు. లోకేష్ కోసం సిద్ధం చేస్తున్న కార్యాలయం పార్టీ కార్యాలయం ఉన్న ప్రధాన భవనంలో కాకుండా దానిని అనుకొని ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యాలయం ఉన్న భవనంలో సిద్ధం చేస్తున్నారట.
మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, ఆడిటర్ సీతారామయ్యలు మేనేజింగ్ ట్రస్టీ, ట్రస్టీలుగా ఉన్నారు. త్వరలో నారా లోకేష్ పేరును కూడా మరో ట్రస్టీగా చేర్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఆ పేరుతో లోకేష్ పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా లోకేష్‌కు పార్టీ వ్యవహారాల్లో ఇద్దరు మిత్రులు సహకరిస్తున్నారట.












Click it and Unblock the Notifications