మిన్నీ మాథ్యూపై స్పీకర్ మనోహర్ గుర్రు

Nadendla Manohar
హైదరాబాద్: శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు కోపమొచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే మనోహర్‌కు కోపం రావడం కాస్తా ఆశ్చర్యకరమే. సభలో సభ్యులు గొడవలు చేస్తున్నాసహనం కోల్పోని ఆయనకు కోపం రావడానికి కారణం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీమాథ్యూ అని చెబుతున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సకాలంలో సమాధానాలు పంపలేదట. దీంతో నాదెండ్ల మనోహర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూపై తన అసహనాన్ని వెళ్లగక్కినట్టు సమాచారం. ఈ నెల 17వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో గురువారం సీఎస్‌తో ఆయన భేటీ అయ్యారు.

జీరో అవర్, ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు వేసే ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు ఇచ్చేలా అధికారులకు కచ్చితమైన ఆదేశాలు ఇవ్వాలని గట్టిగా కోరారు. శాసనసభా సమావేశాల్లో ఎలాగూ ప్రశ్నోత్తరాల సమయం జరగకుండా ప్రతిపక్షాలు వ్యవహరిస్తాయని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారేమో తెలియదు.

అయితే స్పీకర్ మాత్రం ఊరుకోలేదు. "సభ్యుల ప్రశ్నలకు సకాలంలో సమాధానం పంపట్లేదు. మీరు సీరియస్‌గా పట్టించుకోవడం లేదు. మరోసారి ఇలా జరిగితే సహించేది లేదు. సభాహక్కుల నోటీసిచ్చి.. సమన్లు జారీ చేస్తా. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి'' అని హెచ్చరించినట్టు భోగట్టా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+