నడవలేని స్థితిలో ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి

Srilakshmi
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఒఎంసి అక్రమ తవ్వకాల కేసులో అరెస్టయిన ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్‌లో ఆమెనే స్వయంగా ఆ విషయం చెప్పారు. నడవలేని స్థితిలో ఉన్నానని ఆమె కోర్టుకు చెప్పుకున్నారు.
'నాకు వెన్నునొప్పి తీవ్రంగా ఉంది. వైద్యులు ఆపరేషన్ చేయాలని చెప్పారు. అందుకోసమైనా బెయిల్ మంజూరు చేయండి' అని ఆమె కోరారు.

ఈ మేరకు ఆమె తన న్యాయవాది ద్వారా కోర్టులో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 24, 29వ తేదీల్లో నిమ్స్, ఉస్మానియా ఆస్పత్రులకు వెళ్లినపుడు వెన్నునొప్పికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. ఓఎంసీ కేసులో తనను ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు.. బెయిల్ పిటిషన్‌పై 3న కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి సీబీఐకి సూచించి, కేసు ను అదే రోజుకు వాయిదా వేశారు.

తోడు లేకుండా నడవలేక పోతున్నానని శ్రీలక్ష్మి తన బెయిల్ పిటిషన్‌లో చెప్పుకున్నారు. అత్వసరంగా శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారని, చికిత్స చేయకపోతే ఎడమ పాదం స్పర్శ కోల్పోయే ప్రమాదం ఉందని వారన్నారని ఆమె అన్నారు. రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని కూడా వైద్యులు చెప్పినట్లు ఆమె తెలిపారు.

కోర్టుకు ఆమె వైద్యులు ఇచ్చిన నివేదికలను కూడా సమర్పించారు. గత నెల 24, 27 తేదీల్లో శ్రీలక్ష్మిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి వైద్యులు పరీక్షించారు. ఆ తర్వాత నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో కూడా ఆమెకు పరీక్షలు చేశారు. ఆమెకు శస్త్రచికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. మానసికంగా కూడా శ్రీలక్ష్మి కుంగిపోయినట్లు చెబుతున్నారు. అంత చలాకీ అధికారికి ఇంత కష్టమా....

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+