వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరంజీవికి పర్యాటక శాఖ: గిరాకీ కోసమేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
కాంగ్రెసు పార్టీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు చిరంజీవికి పర్యాటక శాఖను అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ భేటీ రాజకీయవర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెసులో చర్చకు దారితీసింది. ఇటీవల వరకు కేబినెట్లోకి వచ్చేందుకు విముఖత వ్యక్తం చేసిన రాహుల్ కొద్ది రోజుల క్రితం ఏ పదవికైనా సిద్ధమని ప్రకటించారు.

నిన్న ప్రధానితో భేటీ అయ్యారు. దీంతో వారం రోజుల్లో కేంద్రమంత్రివర్గ విస్తరణ జరుగుతుందని జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. గుజరాత్, హర్యానా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాహుల్ గాంధీని కేబినెట్లోకి తీసుకునేందుకు, ఖాళీగా ఉన్న వాటిని ఫుల్ ఫిల్ చేసేందుకు, గుజరాత్ రాష్ట్రానికి పెద్ద పీఠ వేసేందుకు సాధ్యమైనంత త్వరగా ఈ విస్తరణ జరిగే అవకాశముంది. ఇది ఈ వారం రోజుల్లోనే జరగనుందని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి, మంత్రివర్గంలో మార్పులు చేర్పులకు అనుమతించిన అధిష్టానం కొంతకాలం ఆగాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు కేంద్రమంత్రివర్గ విస్తరణే కారణమని సమాచారం. మన రాష్ట్రానికి కూడా పెద్ద పీఠ వేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డితో ఢిల్లీ నేతలు ఆయనతో చర్చించారు. చిరంజీవితో పాటు మరో ఇద్దరి ముగ్గురు పేర్లు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

చిరంజీవిని కేబినెట్లోకి తీసుకొని పర్యాటక శాఖ ఇవ్వాలని భావిస్తున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం కేంద్ర పర్యాటక మంత్రిగా ఉన్న సుబోధ్‌కాంత్ సహాయ్ స్థానంలో ఆయనకు ఈ శాఖ కేటాయించాలని అధిష్ఠానం భావిస్తోందట. కోల్‌గేట్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు వచ్చిన సహాయ్‌ని మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలున్నాయి. ఈ శాఖను చిరంజీవికి స్వతంత్ర హోదాతో నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని అధిష్ఠానం యోచిస్తోందట.

చిరంజీవి సినిమా రంగం నుండి వచ్చిన నాయకుడు. ఆయనకు ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాకుండా దక్షిణాదిన, ఉత్తరాదిన కూడా పేరు ఉంది. సినిమా రంగానికి చెందిన వ్యక్తి కాబట్టి చిరంజీవికి పర్యాటక శాఖ ఇస్తే బావుంటుందని భావిస్తున్నారని తెలుస్తోంది. ఆయన వల్ల పర్యాటక రంగం దేశంలో మరింత వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నందు వల్లే కాంగ్రెసు పెద్దలు ఆయనకు టూరిజం శాఖను ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చారట. కాగా గతంలో చిరుకు షిప్పింగ్ ఇస్తారనే వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే.

English summary
It is said that Congress MP Chiranjeevi may taken in to Manmohan Singh cabinet within week. Congress High Command is thinking to give tourism.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X