నిద్రలేని రాత్రులు.. 2062 లోనే సాధారణ స్థితికి : కౌంటింగ్ వేళ త్రిష ఎమోషనల్ పోస్టు..!

తమిళనాడులో ఎన్నికల హోరాహోరీ ముగిసింది. దాదాపు రెండు నెలల పాటు సందడిగా సాగిన ఎన్నికల కోలాహలం ఇటీవల ముగిసింది. ఏప్రిల్ 23న తమిళనాడులో పోలింగ్ జరిగింది. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఓటింగ్ నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే తమిళనాడు రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి తమిళనాడులో 85 శాతానికి పైగా పోలింగ్ నమోదు కావడం ఇదే తొలిసారి.

అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి దళపతి విజయ్ చుట్టూనే తిరిగాయి. సినిమాల్లో కోట్లమంది అభిమానుల్ని సంపాదించుకున్న విజయ్ టీవీకే పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. దాంతో విజయ్ కింగ్ అవుతారా..? లేక కింగ్ మేకర్ అవుతారా..? అని అందరూ తెగ ఎదురు చూస్తున్నారు. విజయ్ ఈ ఎన్నికల్లో పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ రెండు స్థానాల్లో పోటీ చేశారు. ఇక విజయ్ భవితవ్యం మరో నాలుగు రోజుల్లో తేలనుంది. మే 4 న ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

మరోవైపు తమిళనాడు ఎన్నికల్లో రాజకీయ ప్రముఖులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్టార్ హీరోయిన్ త్రిష తన తల్లితో కలిసి చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత చేతివేలుకు ఉన్న సిరా గుర్తును చూపిస్తూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్టు పెట్టారు. అంతేకాక ఆ పోస్టుకు ఆమె విజయ్ తో కలిసి నటించిన గిల్లీ మూవీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను యాడ్ చేయడం విశేషం.

ఇక తాజాగా త్రిష ఇన్ స్టాగ్రామ్ లో మరో పోస్టు పెట్టారు. అందులో ఆమె నిద్ర గురించి మాట్లాడారు. ఒక గంట నిద్రను కోల్పోతే రికవరీ కావడానికి నాలుగు రోజులు పడుతుంది. అంటే నా క్యాలుకులేషన్స్ ప్రకారం 2062 లో నేను సంతోషంగా ఉంటాను.. అనే పోస్టును ఆమె తన ఇన్ స్టా ఖాతాలో స్టేటస్ గా పెట్టుకున్నారు. మరోవైపు త్రిష గురించి బాగా తెలిసినవాళ్లకు మాత్రం ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం అవుతుందని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. త్రిష రాత్రిళ్లు నిద్రపోదట.. ఈ విషయాన్ని ఆమె ఇప్పటికే చాలాసార్లు చెప్పారట. అందుకే 96 మూవీని దర్శకుడు ప్రేమ్ కుమార్ మొత్తం రాత్రిళ్లు షూటింగ్ చేశారట.

Trisha Trisha Sleep Post Goes Viral Amid Tamil Nadu Election Vote Counting Fans React Strongly Trisha

అయితే త్రిష పోస్టుపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమెకు తగినంత నిద్రను ప్రసాదించాలని దేవుడ్ని వేడుకుంటున్నారు. మరికొందరు మాత్రం త్రిష కండీషన్ ను చూసి జాలి పడుతున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. ఇక మే 4 న త్రిష బర్త్ డే జరగనుంది. ఆమె 43 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే త్రిష ఫ్రెండ్స్ అడ్వాన్స్ బర్త్ డే లు చేశారు. అందుకు సంబంధించిన పోస్టుల్ని ఆమె ఇన్ స్టా గ్రామ్ లో పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+