వైసీపీలో తెరపైకి ఫైర్ బ్రాండ్ నేత..! కృష్ణాజిల్లాలో కొడాలిని మించిపోయి..!
రెండు రోజులుగా విజయవాడ శివార్లలో ఉండే పెనమలూరు నియోజకవర్గంలో అధికార టీడీపీ (TDP)కీ, విపక్ష వైఎస్సార్సీపీ (YSRCP)కి మధ్య పొలిటికల్ వార్ సాగుతోంది. దీనికి కారణం ఒకరు స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్ కాగా.. మరొకరు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పెనమలూరు వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న దేవభక్తుని చక్రవర్తి (Devabhaktuni Chakravarthy). వైఎస్సార్సీపీ రాజకీయాల్లో కొత్తగా వినిపిస్తున్న ఈ పేరు ఇప్పుడు చాలా మందికి మాజీ మంత్రి కొడాలి నానిని గుర్తుకుతెస్తోంది. దీనికి కారణం రెండు రోజులుగా ఇక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాలే.
పెనమలూరు నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి జోగి రమేశ్ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఇక్కడ సరైన నేత కోసం ఎదురుచూస్తున్న జగన్ కు దేవభక్తుని చక్రవర్తి రూపంలో ఓ నాయకుడు దొరికాడు. అయితే ఎన్నికలకు చాలా సమయం ఉండటం, అప్పటివరకూ నియోజకవర్గంలో పనిచేసే నేత ఒకరు కావాలనే ఉద్దేశంతో చక్రవర్తికి ఇన్ ఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. అయినా రెండేళ్లుగా పెనమలూరులో వైఎస్సార్సీపీ అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.

అరే పిల్ల బచ్చా...
— Rahul (@2024YCP) June 26, 2026
నేను గాంధీ అంతటి మంచివాడిని కాదు.. నువ్వు ఒకటిస్తే నేను రెండిస్తా...!
-బోడే ప్రసాదు దేవభక్తుని చక్రవర్తి మాస్ వార్నింగ్ pic.twitter.com/rZruDZ0Iwd
కానీ తాజాగా చక్రవర్తి ఈ నియోజకవర్గంలో గతంలో రాజకీయాలు చేసిన తన తాత విగ్రహం ఒకటి రోడ్డు పక్కన ఉంటే దానికి మరమ్మత్తులో చేయించేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే చాపకింద నీరులా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్న చక్రవర్తి ఇదే క్రమంలో తన తాత విగ్రహంపై ఫోకస్ పెట్టడంతో ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అలర్ట్ అయ్యారు. చక్రవర్తికి పోటీగా టీడీపీ శ్రేణుల్ని అక్కడికి పంపారు. టీడీపీ దిమ్మె కూల్చేశారంటూ చక్రవర్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయించి ఆయన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ చక్రవర్తి ఏమాత్రం తగ్గకుండా రోడ్డుపై ఆందోళనకు దిగడంతో పాటు బోడె ప్రసాద్ పై విరుచుకుపడ్డారు. ఆయన శైలి చూసిన వారికి కొడాలి నాని గుర్తుకొస్తున్నారు. దీంతో ఇప్పుడు కృష్ణా జిల్లాలో మరో కొడాలి నాని తరహాలో చక్రవర్తి ఎదుగుతారా అన్న చర్చ మొదలైంది. కొడాలి తరహాలోనే చక్రవర్తి కూడా ప్రత్యర్థులకు వార్నింగ్ లు ఇస్తున్నారు.














Click it and Unblock the Notifications