ఒకే ఫ్రేమ్‌లో చిరు, నాగ్, వెంకీ.. పిక్ వైరల్ !!
టాలీవుడ్ అగ్ర కథానాయకులు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ఓకే చోట మెరిశారు. వారు తమ సతీమణులు సురేఖ, అమల, నీరజలతో కలిసి ఓ వేడుకలో పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ తతంగం అంతా ప్రముఖ నటి ఖుష్బూ సుందర్ పెద్ద కుమార్తె అవంతిక వివాహంలో చోటు చేసుకోవడం గమనార్హం. గోవాలో అత్యంత వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించగా.. దక్షిణాది, బాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. అందులో భాగంగానే సంప్రదాయ వస్త్రధారణలో మెరిసిన ఈ స్టార్ హీరోలు వధూవరులతో కలిసి ఫొటోలు దిగుతూ సందడి చేశారు.
గోవాలోని ఓ లగ్జరీ రిసార్ట్‌లో నిర్వహించిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ ఎంతో ఘనంగా జరిగింది. పెళ్లికి ముందు మెహందీ, సంగీత్, హల్దీ వంటి వేడుకలను కూడా కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా నిర్వహించారు. సంప్రదాయానికి ఆధునికతను జోడిస్తూ నిర్వహించిన ఈ వేడుకలో అవంతిక, శ్రవణ్ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహ వేదికను పూలతో అందంగా అలంకరించగా, అతిథుల కోసం ప్రత్యేక ఆతిథ్య ఏర్పాట్లు చేశారు. కాగా చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శ్రవణ్ శ్రీనివాసన్‌తో అవంతిక ఏడడుగులు వేసింది.

టాలీవుడ్ ప్రముఖులతో పాటు బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, నటి త్రిష తదితరులు కూడా ఈ వివాహ వేడుకలో పాల్గొన్నారు. దీంతో 80, 90ల కాలంలో వెండితెరను ఏలిన పలువురు ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడం అభిమానులను ఆనందానికి గురిచేసింది. ఈ అరుదైన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఖుష్బూ-టాలీవుడ్ స్టార్ హీరోల అనుబంధం
ఖుష్బూకు తెలుగు సినీ పరిశ్రమతో ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వెంకటేశ్‌తో కలిసి 'కలియుగ పాండవులు' చిత్రంలో నటించిన ఆమె, నాగార్జునతో 'కెప్టెన్ నాగార్జున' సినిమాలో హీరోయిన్‌గా మెప్పించారు. అనంతరం చిరంజీవి నటించిన 'స్టాలిన్' చిత్రంలో ఆయన సోదరిగా భావోద్వేగభరితమైన పాత్రలో కనిపించారు. వృత్తిపరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగానూ ఈ ముగ్గురు హీరోలతో ఖుష్బూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. అందుకే ఆమె కుమార్తె వివాహానికి వీరంతా కుటుంబ సభ్యుల్లా హాజరై ప్రత్యేకంగా ఆశీర్వదించారు.
Class 80's Stars....
— Telugu Bit (@Telugubit) June 25, 2026
Legends in Single Frame
At #Khushboo 's daughter in Goa. pic.twitter.com/LyPBVUor1H
రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు..
ప్రస్తుతం రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్న ఖుష్బూ కుటుంబ వేడుకకు పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహానికి హాజరు కాలేకపోయిన పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా మీడియా వేదికగా నూతన దంపతులకు అభినందనలు తెలిపారు. ఇక వివాహ వేడుకలో చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే ఖుష్బూ, ఆమె భర్త దర్శకుడు సుందర్ సి, కుమార్తెలతో కలిసి దిగిన కుటుంబ ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.












Click it and Unblock the Notifications