మళ్ళీ తాడిపత్రిలో ఉద్రిక్తత.. లాఠీఛార్జ్.. పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్!

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో నిత్యం ఏదో ఒక కారణంతో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా నేడు తాడిపత్రి మరోమారు రాజకీయ ఉద్రిక్తతకు కేంద్రంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో తమ పార్టీ నాయకులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ తన నివాసంలో నిరసన కార్యక్రమం చేపట్టడంతో రాజకీయం వేడెక్కింది.

పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట, ఉద్రిక్తత

దీంతో పోలీసులు ఆయనను అనంతపురం తరలించే ప్రయత్నం చేయగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా అడ్డుకున్నారు. ఈ ఘటనలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగి, చివరికి లాఠీఛార్జి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్దారెడ్డి తాడిపత్రిలోని టీడీపీ నాయకులు, తమ కార్యకర్తలపై చేసిన దాడులకు నిరసనగా గాంధీ కూడలిలో దీక్ష చేస్తానని ప్రకటించారు.

Tadipatri politics tension in tadipatri Anantapur as former MLA Peddareddy protest led to clashes

లాఠీఛార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టిన పోలీసులు

అయితే ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.పెద్దారెడ్డిని వాహనంలో తీసుకెళ్లడానికి ప్రయత్నించిన పోలీసులను వైసీపీ కార్యకర్తలు సిమెంట్ బెంచీలు అడ్డుపెట్టి అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత తీవ్రరూపం దాల్చింది. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు లాఠీఛార్జి చేసి నిరసనకారులను చెదరగొట్టారు. తర్వాత పెద్దారెడ్డిని ఆయన సొంత నివాసంలోనే హౌస్ అరెస్ట్ చేసి, చుట్టుపక్కల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

వైసీపీ నిరసనను టార్గెట్ చేసిన టీడీపీ

ఆయన బయటకు రాకుండా ఇంటి చుట్టూ పోలీసు బలగాలు మోహరించారు. తాడిపత్రి పట్టణంలోని ముఖ్యమైన చోట్లన్నీ పోలీసు భద్రతలో ఉంచి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేసిన వారు ఇప్పుడు తమపై దాడులు చేస్తున్నారని నిరసన చేపట్టడం సరికాదని టీడీపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు.

నేను గుంపు మేస్త్రినే.. మరోమారు క్లారిటీ ఇచ్చిన రేవంత్.. వైరల్ వీడియో!
నేను గుంపు మేస్త్రినే.. మరోమారు క్లారిటీ ఇచ్చిన రేవంత్.. వైరల్ వీడియో!

పెద్దారెడ్డి నిరసన దీక్షను అడ్డుకోవాలని టీడీపీ పిలుపు

జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ శ్రేణులకు పెద్దారెడ్డి నిరసన దీక్షను అడ్డుకోవాలని పిలుపు ఇవ్వడంతో మరింత ఉద్రిక్తత పెరిగింది. దీక్ష చేయడానికి ప్రయత్నించిన వారిని అడ్డుకుంటామని టీడీపీ వర్గాలు హెచ్చరించాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తతకు కారణం అయ్యింది. ప్రస్తుతం తాడిపత్రి పట్టణం పోలీసు భద్రతలో ఉంది. రెండు పార్టీల మధ్య ఉన్న పోటీ, ఘర్షణలకు దారి తీయకుండా అధికారులు అప్రమత్తం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+