బంగాళాఖాతంలో వాయుగుండం: తీవ్ర తుఫాన్ గా 19న ఏపీ తీరానికి

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది. వాయుగుండంగా మారింది. మంగళవారం నాటికి తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందబోతోంది. అనంతరం క్రమంగా ఇది కోస్తాంధ్ర తీరం వైపు కదలనుంది. గురువారం నాటికి తీవ్ర తుఫాన్ గా ఆవిర్భవిస్తుందని భారత వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించాయి. దీని ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నాయని వివరించాయి.

ఈ తీవ్ర తుఫాన్.. ఈ నెల 19వ తేదీ నాటికి అంటే గురువారానికి ఏపీ తీరం వైపునకు కదిలే అవకాశం ఉండటంతో కోస్తా జిల్లాల పరిధిలోని అన్ని స్థాయిల అధికార యంత్రాంగాన్ని ప్రభుత్వం ముందస్తుగా అప్రమత్తం చేసింది. ప్రస్తుతం ఈ వాయుగుండం గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తరం- వాయవ్య దిశగా కదులుతోంది. విశాఖపట్నానికి ఆగ్నేయంగా 960 కిలోమీటర్లు, చెన్నై- 800, ఒడిశాలోని గోపాల్‌పూర్‌- 1,070 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

Cyclonic Storm Brewing in Bay of Bengal Northwest Latest Tracking Distances and Movement Speed

రాబోయే పరిణామాలను ఎదుర్కొనడానికి విపత్తు నిర్వహణ శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. స్థానికంగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చారు. పరిస్థితి తీవ్రతను బట్టి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు.

నేటి నుంచి తిరుమలలో భక్తులకు అందుబాటులోకి: గ్రాండ్ విజువల్స్- టైమింగ్స్, ఎంట్రీ ఫీజు
నేటి నుంచి తిరుమలలో భక్తులకు అందుబాటులోకి: గ్రాండ్ విజువల్స్- టైమింగ్స్, ఎంట్రీ ఫీజు

ఈ తుఫాన్ ప్రభావంతో గురు, శుక్రవారాల్లో ఏపీలోని పలు కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలోనే మంగళవారం వరకు కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. తీవ్రమైన గాలుల వల్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+