నేటి నుంచి తిరుమలలో భక్తులకు అందుబాటులోకి: గ్రాండ్ విజువల్స్- టైమింగ్స్, ఎంట్రీ ఫీజు

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక విజ్ఞానాన్ని అందించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఓ అడుగు ముందుకేసింది. శ్రీవారి ఆలయ మహత్యం, శతాబ్దాల నాటి పూజా సంప్రదాయాలు, అరుదైన కళా సంపదను ప్రతిబింబించేలా రూపుదిద్దుకున్న నూతన ఎస్వీ మ్యూజియాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆధునిక మ్యూజియం నేటి నుండి సాధారణ భక్తుల సందర్శనార్థం తెరచుకోనుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఏడాది సెప్టెంబర్ 16న ఈ మ్యూజియాన్ని అధికారికంగా ప్రారంభించారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణం, నాలుగు అంతస్తుల ప్రాంగణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని తీర్చిదిద్దారు. తిరుమల కొండపై ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడుతూనే, మన సనాతన సంస్కృతిని భావితరాలకు వివరించడమే లక్ష్యంగా దీన్ని పునరుద్ధరించారు. భక్తులకు ఓ నూతన అనుభూతిని పంచేలా అత్యాధునిక టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. దీనికోసం టీసీఎస్.. తనవంతు సహకారాన్ని అందించింది.

Revamped SV Museum adds a new dimension to spiritual journey by presenting hill shrine s rich past

ఈ మ్యూజియంలో మొత్తం 14 ప్రత్యేక గ్యాలరీలు ఉన్నాయి. ప్రాచీన కాలం నాటి సుమారు 8,000 కు పైగా అరుదైన కళాఖండాలు, రాతి శిల్పాలు, కాంస్య విగ్రహాలు, ప్రాచీన నాణేలు, వివిధ రాజవంశాలు స్వామివారికి సమర్పించిన అరుదైన ఆయుధాలు ఇక్కడ కొలువుదీరాయి. ప్రతి గ్యాలరీ కూడా శ్రీవారి భక్తులకు సనాతన ధర్మ వైభవాన్ని, తిరుమల క్షేత్ర చరిత్రను కళ్లకు కట్టేలా ప్రత్యేక ఇతివృత్తంతో అలరించబోతోంది.

భారతీయ శిల్పకళా వైభవానికి నిదర్శనంగా నిలిచే స్టోన్ స్కల్ప్చర్, బ్రాంజ్ స్కల్ప్చర్ గ్యాలరీలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తిరుమల ఆలయ నిర్మాణ పరిణామ క్రమం, వివిధ శతాబ్దాల్లో దేవాలయ అభివృద్ధికి సహకరించిన రాజులు, దాతల వివరాలు, ఆనాటి పూజా విధానాల్లోని విశేషాలను ఇక్కడ భద్రపరిచారు. శ్రీవారి ఆలయ మూలాలు, రాతి శిల్పాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావనలను తెలుసుకోవడానికి దోహదపడుతుంది.

Revamped SV Museum adds a new dimension to spiritual journey by presenting hill shrine s rich past

పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా వివరించడానికి ఓ ప్రత్యేక గ్యాలరీని కేటాయించారు. అన్నమయ్య రాసిన అరుదైన తాళపత్ర గ్రంథాలు, ఆయన కాలం నాటి నాణేల చరిత్రతో పాటు ప్రాచీన సంప్రదాయ సంగీత వాయిద్యాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భారతీయ సంగీత, నృత్య కళలతో తిరుమలకు ఉన్న చారిత్రక అనుబంధాన్ని నూతన తరానికి పరిచయం చేసేలా ఈ ప్రదర్శనలను అమర్చారు.

Revamped SV Museum adds a new dimension to spiritual journey by presenting hill shrine s rich past

ఈ మ్యూజియంలో అత్యంత ప్రధానమైన ఆకర్షణ.. 'బ్రహ్మాండం' గ్యాలరీ. సృష్టి రహస్యాలు, విశ్వ విస్తృతి, వేదకాలపు ఖగోళ విజ్ఞానం వంటి క్లిష్టమైన అంశాలను సామాన్య భక్తులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో దీన్ని డిజైన్ చేశారు. హాలోగ్రాఫిక్ ప్రదర్శన, 360 డిగ్రీల అడ్వాన్స్‌డ్ విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో విశ్వ ఆవిర్భావ రహస్యాలను భక్తుల కళ్లముందు అద్భుతంగా దృశ్యావిష్కారం చేయనుందీ మ్యూజియం.

అలిపిరి కాలిబాట మార్గంలో ఇకపై..
అలిపిరి కాలిబాట మార్గంలో ఇకపై..

ఈ మ్యూజియం ఎంట్రీ ఫీజు రూ. 50. నేటి నుంచి ప్రతి రోజూ ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ మ్యూజియాన్ని భక్తులు సందర్శించవచ్చు. టికెట్ల జారీని సాయంత్రం 4 గంటలకు నిలిపివేస్తారు. శ్రీవారి దివ్య దర్శనం భక్తులకు భక్తి పారవశ్యాన్ని అందిస్తే.. ఈ మ్యూజియం తిరుమల వెనుక ఉన్న అపారమైన చరిత్రను, కళా వైభవాన్ని పరిచయం చేస్తుంది. ఆధ్యాత్మికత, విజ్ఞానం, అత్యాధునిక సాంకేతికతల కలయికగా రూపొందిన ఈ మ్యూజియం తిరుమల యాత్రలో భక్తులకు దివ్యానుభూతిని పంచనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+