వాహనదారులకు బిగ్ అలెర్ట్.. ఈ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎలా వెళ్లాలి..?

హైదరాబాద్ నగరంలోని వాహనదారులకు బిగ్ అలర్ట్.. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ వైపు ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి NFCL మధ్య స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనగర్ టి జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. SNT Junction నుంచి బంజారాహిల్స్ రోడ్ నెం 2 వెళ్లే దారిని మూసి వేస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్ తెలిపారు.

ఈ మేరకు వాహనదారులు రోడ్ నంబర్ 2 వైపు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచనలు చేశారు. ముఖ్యంగా పీక్ అవర్స్ గా పిలిచే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల వరకు.. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్య పీక్ అవర్స్ రద్దీ తీవ్రంగా ఉంటుందని తెలిపారు. ఈ సమయాల్లో ఆయా మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనదారులు వెళ్లాలని స్పష్టం చేశారు. అయితే ఈ నిర్మాణ పనులు ఎంతకాలం సాగుతాయో.. ట్రాఫిక్ మళ్లింపులు ఎప్పటివరకు అమల్లో ఉంటాయనే దానిపై ఇంకా అధికారికంగా తుది గడువును వెల్లడించక పోవడం గమనార్హం.

Hyderabad city traffic restrictions on these routes A major alert latest how should you travel in

ఇక వాహనదారుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించిన వివరాలు చూస్తే.. SNT Junction వద్ద ఉన్న రైట్ టర్న్ మూసివేసిన నేపథ్యంలో.. వాహనదారులు ఎడమవైపు తిరిగి NFCL వైపు వెళ్లాలి. అక్కడే యూ-టర్న్ తీసుకుని రోడ్ నంబర్ 2కు చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే శ్రీనగర్ కాలనీ నుంచి ఎన్టీఆర్ భవన్, కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనదారులు ఇందిరానగర్, వెంకటగిరి, జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 మీదుగా మాదాపూర్ చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే NFCL నుంచి మాదాపూర్ వెళ్లే ప్రయాణికులు.. టి జంక్షన్ వద్ద కుడివైపు తిరిగి వెంకటగిరి, జూబ్లీహిల్స్ రోడ్ నెం 10 మీదుగా మాదాపూర్ చేరుకోవాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+