యోగా, జిమ్ వర్కవుట్స్ లల్లో ఏది బెటర్: అదే శ్రీరామరక్ష

ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జిమ్‌కు వెళ్లి కసరత్తులు చేయాలా లేక ప్రశాంతంగా యోగా సాధన చేయాలా? నేటి తరం ఆరోగ్య ప్రేమికులలో తరచూ తలెత్తే ఓ సాధారణ సందేహం ఇది. ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల ముప్పు తీవ్రంగా పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏదో ఒక రకమైన శారీరక శ్రమ తప్పనిసరైంది. ఈ రెండింటిలో ఏది గుండెకు అత్యంత మేలు చేస్తుందనే ప్రశ్నకు డాక్టర్లు స్పష్టమైన వివరణ ఇస్తున్నారు.

ఢిల్లీ అపోలో క్లినిక్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రజనీ శర్మ అభిప్రాయం ప్రకారం.. జిమ్ వర్కవుట్లు, యోగా ఒకదానితో ఒకటి పోటీ పడే వ్యాయామాలు కావు. ఇవి రెండూ గుండె పనితీరును వేర్వేరు మార్గాల్లో మెరుగుపరుస్తాయి. అందుకే, ఈ రెండింటినీ సమతుల్యం చేసుకొంటూ దైనందిన జీవితంలో భాగం చేసుకోవడమే ఆరోగ్యానికి అత్యుత్తమ మార్గమని ఆమె సూచిస్తున్నారు.

Yoga Or Gym Workouts which is better Differences in Strength Weight Management and Flexibility

సాధారణంగా జిమ్‌లో చేసే రన్నింగ్, సైక్లింగ్, వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు గుండె కండరాలను బలోపేతం చేయడానికి అద్భుతంగా తోడ్పడతాయి. ఇవి శరీరం అంతటా రక్తప్రసరణను మెరుగుపరిచి, ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి. క్రమం తప్పకుండా ఇటువంటి కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. శారీరక దృఢత్వం పెరుగుతుంది.

యోగాతో చేకూరే ప్రయోజనాలు

జిమ్ వ్యాయామాల కంటే భిన్నంగా యోగా శరీరానికి కావాల్సిన శ్రమ, శ్వాస వ్యవస్థ, మానసిక ప్రశాంతతపై దృష్టి పెడుతుంది. గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఒకటిగా భావించే మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో యోగా ఎంతగానో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా శ్వాస నియంత్రణకు ఉపయోగ పడే ప్రాణాయామం, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడిని కలిగించే హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, గుండెకు విశ్రాంతి లభిస్తుంది.

యోగా మాత్రమే గుండెకు అవసరమైన పూర్తి శారీరక సామర్థ్యాన్ని (కార్డియో ఎండ్యూరెన్స్) అందించలేదని నిపుణులు గుర్తు చేస్తున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి వారం కనీసం 150 నిమిషాల మోస్తరు తీవ్రత గల ఎరోబిక్ కసరత్తులు అవసరమని వైద్య శాస్త్రం చెబుతోంది. కాబట్టి యోగాతో పాటు వేగంగా నడవడం లేదా సైక్లింగ్ వంటి వాటిని జోడించడం తప్పనిసరి.

సమతుల్య దినచర్యతోనే గుండె రక్షణ

గుండెను పదిలంగా ఉంచుకోవడానికి ఒక వైవిధ్యమైన ప్రణాళిక అవసరం. వారంలో కొన్ని రోజులు జిమ్ వ్యాయామాలు, మరికొన్ని రోజులు యోగా లేదా ధ్యానం చేయడం వల్ల గుండె గదులు బలోపేతం అవ్వడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా దూరమవుతుంది. ప్రతీ ఒక్కరూ తమ వయసు, అనారోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని వ్యాయామాలను ఎంచుకోవాలి. ఏవైనా గుండె సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా నిపుణులను సంప్రదించిన తర్వాతే కసరత్తులు ప్రారంభించాలి.

తీవ్రమైన వర్కవుట్లు చేయడం కంటే క్రమం తప్పకుండా చేసే తేలికపాటి వ్యాయామాలే గుండెను ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతాయి. జిమ్ ద్వారా శారీరక ఎదుగుదలను, యోగా ద్వారా మానసిక సమతుల్యతను సాధించవచ్చు. ఈ రెండు విభిన్న ప్రక్రియల ముడికలే జీవితాంతం గుండెకు శ్రీరామరక్షగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+