రుచికరమైన 'కొబ్బరి లవుజు'.. ఈ కొలతలతో చేస్తే నోట్లో కరిగిపోతుంది!

తెలుగువారి ఇళ్లల్లో ఒకప్పుడు పండగలు వచ్చినా, ఏదైనా శుభకార్యాలు జరిగినా లడ్డూలు, జంతికల కంటే ముందే మనసుకు గుర్తొచ్చేది వంటింట్లో గుమగుమలాడే సాంప్రదాయ పిండివంటలే. ఆధునిక కాలంలో బేకరీ స్వీట్లు, విదేశీ చాక్లెట్లు మార్కెట్లోకి ఎన్నో అందుబాటులోకి వచ్చినప్పటికీ, మన ముత్తాతల కాలం నాటి సాదాసీదా వంటకాల రుచి ఎప్పటికీ చెరిగిపోదు. అలాంటి ఒక అద్భుతమైన, తిన్న కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ స్వీట్ 'కొబ్బరి లవుజు'.

మూడే మూడు ప్రధాన పదార్థాలతో కొబ్బరి లవుజు

కొబ్బరి లవుజు లేదా కొబ్బరి బర్ఫీ ప్రతీ ఇంట్లోనూ చాలా సాధారణంగా చేసుకునే ఆరోగ్యకరమైన స్వీట్లలో ఒకటి. కేవలం మూడే మూడు ప్రధాన పదార్థాలతో, చాలా తక్కువ ఖర్చుతో అద్భుతమైన రుచితో తయారయ్యే ఈ స్వీట్ తెలుగువారి సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. ఇప్పుడు ఈ సాంప్రదాయ స్వీట్ తయారీకి అసలైన కొలతలు మరియు కావలసిన పదార్థాల వివరాలను చూద్దాం.

Kobbari Lavuju At Home How To Make Traditional kobbari lavuju Easy Recipe With Perfect Measurements

కొబ్బరి లవుజు తయారీకి అవసరమైన పదార్థాలు

ముదురు పచ్చి కొబ్బరి తురుము: 2 ½ కప్పులు

పంచదార (చక్కెర): 2 కప్పులు

యాలకల పొడి: ½ టీస్పూన్

నెయ్యి: 1 టీస్పూన్

నీళ్లు: ½ కప్పు

స్వీట్ తయారీ విధానం:

కొబ్బరి లవుజు తయారు చేయటానికి బాగా ముదిరిన పచ్చి కొబ్బరిని ఎంచుకుంటే తురుము చాలా రుచిగా ఉండి, లవుజుకు మంచి ఆకృతి వస్తుంది. కొబ్బరి వెనుక వైపు ఉండే బ్రౌన్ కలర్ పొట్టును కావాలనుకుంటే తీసివేయవచ్చు లేదా అలాగే ఉంచి కూడా సన్నగా తురుముకోవచ్చు. ఓపిక లేని వారు మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు.

తీగపాకం వచ్చే దాకా పంచదార మరిగిస్తేనే మంచి లవుజు

తురుము సిద్ధమైన తర్వాత, స్టవ్ మీద ఒక మందపాటి పాత్రను ఉంచి అందులో రెండు కప్పుల పంచదార, అర కప్పు నీళ్లు పోయాలి. మంటను మధ్యస్థంగా ఉంచి పంచదారను పూర్తిగా కరగనివ్వాలి. పంచదార నీరు మరుగుతున్నప్పుడు అది ఒక తీగ పాకం వచ్చే వరకు కాచుకోవాలి. చేత్తో పాకాన్ని తాకి చూసినప్పుడు ఒక సన్నని తీగలా సాగితే పాకం సిద్ధమైనట్లేనని గుర్తుంచుకోవాలి.

ఇలా చేస్తే సూపర్ టేస్టీ కొబ్బరి లవుజు

తీగ పాకం వచ్చిన వెంటనే మనం సిద్ధంగా ఉంచుకున్న రెండున్నర కప్పుల పచ్చికొబ్బరి తురుమును ఆ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. మంటను పొయ్యికి తగినట్లుగా తగ్గించి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపటికి పంచదార పాకం మరియు కొబ్బరి తురుము కలిసిపోయి తెల్లటి పాల నురగలాగా పొంగు రావడం గమనించవచ్చు. ఈ దశలోనే యాలకల పొడి, కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలి.

ముక్కలుగా కట్ చేసుకోవాలంటే ఇలా ఉండాలి

లవుజు మరింత దగ్గరపడి, గిన్నె అంచులకు అంటుకోకుండా మధ్యలోకి ముద్దగా వస్తున్నప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. ముందే నెయ్యి రాసి పెట్టుకున్న పళ్లెంలో లేదా బటర్ పేపర్ పరిచిన ప్లేటులో ఈ వేడి మిశ్రమాన్ని వేసి సమానంగా దానిని సెట్ చెయ్యాలి. ఇది కాస్త వేడిగా ఉన్నప్పుడే చాకుతో మనకు నచ్చిన పరిమాణంలో చతురస్రాకారంలో కట్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి చక్కటి ముక్కలుగా వస్తాయి.

రాత్రి నిద్ర పట్టట్లేదా, పగలు నిద్ర ఆగట్లేదా? డేంజర్ బెల్స్!
రాత్రి నిద్ర పట్టట్లేదా, పగలు నిద్ర ఆగట్లేదా? డేంజర్ బెల్స్!

ఈ టిప్స్ తో నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి లవుజు

సాధారణంగా కొబ్బరి మరియు పంచదార కొలతను సమాన పరిమాణంలో తీసుకుంటారు. అయితే, అలా సమానంగా వేస్తే కొబ్బరి కంటే పంచదార తీపి ఎక్కువై, ఒక్క ముక్క తిన్నాక ఇంకా వద్దు అనిపిస్తుంది. వెగటుగా అనిపిస్తుంది. అందుకే రెండున్నర కప్పుల కొబ్బరి తురుముకు రెండు కప్పుల పంచదారను వాడటం వల్ల లవుజు లోని తీపి కావాల్సినంత మాత్రమే ఉండి అందరూ ఎంతో ఇష్టంగా తినేలా లవుజు తయారవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+