కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. ముగ్గురు మృతి.. శిథిలాల కిందే మరికొంతమంది..!

దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. సీమాపురిలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరి కొంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే దిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. శిథిలాలను తొలగించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇక మృతుల్లో గర్భిణి, చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటివరకూ 8 మంది గాయపడగా వారిని తాహీర్ పూర్ లోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. క్షతగాత్రుల వివరాలు ఇలా ఉన్నాయి. మోమిన్ మీర్జా(56), అబ్దాన్(3), అబ్దుల్ రహ్మాన్(28), దేవ్ రుద్దిన్(28), సల్మా(50), చోటే(34), సఖీనా(35), సమద్(30) గా గుర్తించారు. అలాగే మృతి చెందిన గర్భిణి గుల్ఫానా(21) గా తేలింది. మరో 12 ఏళ్ల చిన్నారి కూడా మృతి చెందగా ఆమె వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై డీసీపీ రాజేంద్ర ప్రసాద్ మీనా మాట్లాడుతూ ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు.

ఇటీవల దిల్లీలో సత్యా నికేతన్ ప్రాంతంలో హాస్టల్ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనను మరువకముందే మరోసారి ఇలాంటి ఘటన జరగడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిల్లీ ఫైర్ సర్వీస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల సమయంలో జరిగింది. ప్రస్తుతం ఘటనాస్థలిలో సెర్చ్ అండ్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతున్నట్లు ఓ అధికారి పేర్కొన్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అక్కడి పరిస్థితి భయానక వాతావరణాన్ని తలపిస్తోంది. స్థానికులు, బంధువుల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అనేక మంది స్థానికులు ఈ ఘటనాస్థలికి వచ్చి తమ మొబైల్స్ లో వీడియోలను చిత్రీకరిస్తున్నారు.

Delhi 5-storey building collapses 3 dead including a pregnant woman and a child building collapse

మరోవైపు ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన అర గంటకు పోలీసులు వచ్చారని.. ఓ చిన్నారి తమ కళ్లముందే శిథిలాల్లో చిక్కుకుని మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. శిథిలాల కింద ఉన్నవారిలో ఓ ఇద్దరిని తామే అతి కష్టం మీద కాపాడి సీపీఆర్ అందించామని ఆ తర్వాత సమీప ఆస్పత్రికి పంపించామని తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+