టీఎంసీ రెబెల్స్ కు మమత తాజా వార్నింగ్..! రీఎంట్రీపై క్లారిటీ..!

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కౌన్సిలర్లకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. అనారోగ్యంతో ఉన్న తల్లిని వదిలివేయడంతో వారి తిరుగుబాటును ఆమె పోల్చారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం సాగిస్తున్న 'నిరంతర అణచివేత' నేపథ్యంలో, ఉత్తర కోల్‌కతా జిల్లా తృణమూల్ కాంగ్రెస్ వర్చువల్ సమావేశంలో ఆమె కార్యకర్తలను, కేడర్లను ఉత్తేజపరిచేందుకు మాట్లాడారు.

మమత మేనల్లుడికి కలకత్తా హైకోర్టు షాక్..!
మమత మేనల్లుడికి కలకత్తా హైకోర్టు షాక్..!

ఇది జీవితాంతం మిమ్మల్ని పెంచి పోషించిన తల్లి అనారోగ్యం పాలైతే, మీరు ఆమెను పట్టించుకోకపోవడం లాంటిదంటూ రెబెల్స్ కు మమత తెలిపారు. ద్రోహులకు క్షమాభిక్ష ఉండదన్నారు. వారు ఈ రోజు తమను తాము కాపాడుకోవచ్చని, కానీ భవిష్యత్తులో ప్రజలు, కార్యకర్తలు వారి నుండి జవాబు కోరతారన్నారు. ప్రస్తుత రాజకీయ వాతావరణం భయం, ఆర్థిక సంక్షోభంతో నిండి ఉందన్నారు. ఇది ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న నిరంతర అణచివేతల పరంపర. ప్రజలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, భయంతో వణికిపోతున్నారు; వీధి వ్యాపారుల దుకాణాలను కూల్చివేస్తున్నారు. చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు, వారి జీవిత కలలు చెదిరిపోతున్నాయన్నారు.

Mamata Banerjee Vows No Pardon for TMC Defectors Equates Party Betrayal to Abandoning Mother
సువేందుకు మమత తొలి షాక్..! కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు..!
సువేందుకు మమత తొలి షాక్..! కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు..!

ఈ సంక్షోభం నుండి ఐక్యంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మాత్రమే రక్షణ కల్పించగలదని మమత తేల్చిచెప్పారు. ఇది బీజేపీ సృష్టించిన సంక్షోభమని,తాము కాదన్నారు. తమ కార్యకర్తలు ప్రాణాలను, సర్వస్వాన్ని పణంగా పెట్టి ఎలా పోరాడారో మీకు తెలుసని, బూత్ స్థాయి కార్యకర్తలు, బీఎల్‌ఓల నుండి క్షేత్రస్థాయి కేడర్ల వరకు, వారి ప్రాణాలు, త్యాగాల ఫలితంగానే నేటి విజేతలు అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. కేసులు, కుటుంబ ఆస్తులకు భయపడి పార్టీని వీడుతున్నారని రెబెల్స్ పై మమత ఆరోపణలు చేశారు. కొందరు కార్యకర్తలను 'కాపాడటానికి పార్టీ మారామని చెబుతున్నారని, కానీ వారు తమ సొంత ప్రాంతాల్లోకి కూడా ప్రవేశించలేకపోతున్నారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+