IPL 2026 Playoffs Race: ఐపీఎల్ ప్లేఆఫ్ రేసులో ఎవరెక్కడ ? టాప్ 4 బెర్తుల పోటీలో..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్స్ రేసు ( IPL 2026 Playoffs Race) అప్పుడే మొదలైపోయింది. ఇప్పటికే పూర్తయిన మ్యాచ్ లు, వాటిలో ఆయా జట్లు సాధించిన పాయింట్ల ఆధారంగా ప్లే ఆఫ్స్ రేసుపై స్పష్టత వస్తోంది. అలాగే టోర్నీ నుంచి నిష్క్రమించే జట్లపైనా క్లారిటీ వస్తోంది. ఈ నేపథ్యంలో మార్కెట్ అంచనాలు, ఇతర అంశాల ఆధారంగా ప్లే ఆఫ్ కు అర్హత సాధించే అవకాశం ఉన్న జట్లు ఏంటో, మిగతా జట్ల అవకాశాలు ఏంటో ఓసారి చూద్దాం..

ఏప్రిల్ చివరి నాటికి చూస్తే ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు తీవ్రమవుతోంది. మార్కెట్ డేటా, నిపుణుల విశ్లేషణల ఆధారంగా చూస్తే
పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం ప్లేఆఫ్ స్థానాన్ని దక్కించుకోవడానికి ఎక్కువ అవకాశాలను కలిగి ఉన్నాయి. ఆ తర్వాత స్ధానాల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు ఉన్నాయి. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరంభంలో వెనుకబడ్డా.. ఇప్పుడు కాస్త కోలుకున్నాయి. ఇందులో ముంబైకి ప్లే ఆఫ్ అవకాశం ఉన్నట్లు మార్కెట్ విశ్లేషణలు చెప్తున్నాయి.

IPL 2026 Playoffs Race Current Standings and Top 4 Predictions

ఐపీఎల్ 2026లో 10 జట్లు మొత్తం 74 మ్యాచ్‌లు ఆడనున్నాయి. ప్రతి జట్టు 14 లీగ్-దశ మ్యాచ్‌లలో (మొత్తం 70) పోటీపడుతున్నాయి. ఛాంపియన్‌ను నిర్ణయించడానికి 4 ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరుగుతాయి. లీగ్ దశ తర్వాత అగ్రస్థానంలో నిలిచిన 4 జట్లు అదనంగా 4 నాకౌట్ గేమ్‌లు ఆడతాయి. ఇవి క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2, మే 31న జరిగే ఫైనల్. ఇందులో ఏ ఒక్క జట్టు కూడా ఈ 4 గేమ్‌లలోనూ ఆడదు. సాధారణంగా 3-4 జట్లు వీటిలో ఆడతాయి. టోర్నీ ముందుకు సాగే కొద్దీ వీటిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

IPL 2026 Playoffs Race Current Standings and Top 4 Predictions

ప్రస్తుతం ఆర్సీబీ, సన్ రైజర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్, చెన్నై, ఢిల్లీ, కోల్ కతా, లక్నో 8 మ్యాచ్ లు చొప్పున ఆడాయి.
మిగిలిన జట్లు ఏడేసి మ్యాచ్ లు ఆడాయి. టాప్ 4లో ఉన్న జట్లలో పంజాబ్ 7 మ్యాచ్ లే ఆడినా 13 పాయింట్లతో అగ్రస్దానంలో ఉంది. ఆర్సీబీ 8 మ్యాచ్ లు ఆడి ఆరు గెలిచి 12 పాయింట్లతో రెండో స్ధానంలో ఉంది. సన్ రైజర్స్ 8 మ్యాచ్ లు అడి ఐదు గెలిచి 10 పాయింట్లతో మూడో స్ధానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్ కూడా 8 మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లు గెలిచినా రన్ రేట్ కారణంగా నాలుగో స్ధానంలో ఉంది. ఈ నాలుగు జట్లకు ప్రస్తుతానికి ప్లేఆఫ్ చేరడానికి మెరుగైన అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+